Uttarakhand Tunnel Rescue: సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు నేడు బయటకు.. సిద్ధంగా హెలికాప్టర్‌, అంబులెన్సులు

|

Nov 23, 2023 | 9:00 AM

ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అలుపెరగని ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో వారు ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు మంగళవారం రాత్రి నుంచి అమెరికన్‌ ఆగర్‌ యంత్రంతో తిరిగి చేపట్టిన పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 800 మి.మీ. వ్యాసార్ధం ఉన్న స్టీలుపైపులను భూమికి సమాంతరంగా శిథిలాల ద్వారా 45 మీటర్ల మేర ప్రవేశపెట్టగలిగారు. ఇంకా 12 మీటర్ల డ్రిల్లింగ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హెలిప్యాడ్ వద్ద 41 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. అన్ని అంబులెన్స్‌లలో వైద్యుల..

Uttarakhand Tunnel Rescue: సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు నేడు బయటకు.. సిద్ధంగా హెలికాప్టర్‌, అంబులెన్సులు
Uttarakhand Tunnel Rescue
Follow us on

ఉత్తర్‌కాశీ, నవంబర్‌ 23: ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అలుపెరగని ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో వారు ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు మంగళవారం రాత్రి నుంచి అమెరికన్‌ ఆగర్‌ యంత్రంతో తిరిగి చేపట్టిన పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 800 మి.మీ. వ్యాసార్ధం ఉన్న స్టీలుపైపులను భూమికి సమాంతరంగా శిథిలాల ద్వారా 45 మీటర్ల మేర ప్రవేశపెట్టగలిగారు. ఇంకా 12 మీటర్ల డ్రిల్లింగ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హెలిప్యాడ్ వద్ద 41 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. అన్ని అంబులెన్స్‌లలో వైద్యుల బృందం సిద్ధంగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ రెస్క్యూ మెషిన్ ఒకటి నుండి రెండు గంటల్లో పూర్తవుతుంది. మరికొద్దిసేపట్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. 11వ రోజు చేరుకున్న ఈ రెస్క్యూ మిషన్‌ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

కాగా దీపావళి రోజున కూలిన టన్నెల్‌ 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. అదే రోజు నుంచి కూలీలను రక్షించేందుకు సహాయక పనులు ప్రారంభించారు. ప్లాన్ A కింద సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను తొలగించే ప్రయత్నం చేవారు. కానీ అది విజయవంతం కాలేదు. దీంతోకారణంగా రెస్క్యూ అధికారులు ఈ ప్రయత్నాన్ని విరమించారు. ప్లాన్ బి కింద, అమెరికన్ ఎర్త్ ఆగర్ యంత్రాన్ని ఉపయోగించి శిథిలాలలోకి 800 మైళ్ల స్టీల్ పైపును చొప్పించడం ద్వారా కార్మికులను రక్షించడానికి మరో ప్రణాళికను సిద్ధం చేశారు. అమెరికన్ ఎర్త్ ఆగర్ యంత్రాన్ని మూడు వైమానిక దళ విమానాల నుంచి తరలించారు. అయితే ఈ యంత్రం 22 మీటర్ల డ్రిల్లింగ్ తర్వాత విరిగిపోయింది. ఆ తర్వాత ఇండోర్‌ నుంచే మరో ఎర్త్‌ ఆగర్‌ యంత్రాన్ని తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ యంత్రంతో డ్రిల్లింగ్‌ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యంత్రం 45 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తి చేసింది. ఇంకా 12 మీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది.

డ్రిల్లింగ్‌ పూర్తయిన తర్వాత ఈ పైపు సహాయంతో కార్మికులను రక్షించవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొరంగం వద్దకు పలువురు అధికారులు చేరుకున్నారు. మరికాసేపట్లో డెహ్రాడూన్ నుంచి సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఏ క్షణంలోనైనా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఆన్‌సైట్‌లో పరిశీలించేందుకు నేను ఉత్తరకాశీకి చేరుకుంటున్నానని సీఎం ధామి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తెలిపారు. హెలిప్యాడ్ వద్ద ఇప్పటికే 41 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. అన్ని అంబులెన్స్‌లలో వైద్యుల బృందం ఉంది. ఎందుకంటే కార్మికుల సంఖ్య 41, అందుకే 41 అంబులెన్స్‌లను పిలిపించినట్లు సీఎం తెలిపారు.

ఇవి కూడా చదవండి

సొరంగం నుంచి కార్మికులను రక్షించి బయటకు తీసుకొచ్చిన వెంటనే బాణాసంచా కాల్చి స్వాగతం పలుకుతామని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీపావళి రోజు నుంచి మొత్తం 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారని, దీని కారణంగా వారు, వారి కుటుంబాలు, రెస్క్యూలో పాల్గొన్న బృందాలు దీపావళిని జరుపుకోలేదని.. ఈరోజు రెస్క్యూ విజయవంతమైతే దీపావళిని బయట జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రిల్లింగ్‌ పూర్తయితే తాడు, స్ట్రెచర్, ఆక్సిజన్ సిలిండర్‌తో 10 నుంచి 12 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సొరంగం లోపలికి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతా మంచే జరగాలని ఆశిద్దాం..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.