AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపై నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లిన బెంజ్ కారు.. నలుగురు మృతి, ఇద్దరికి సీరియస్!

బుధవారం రాత్రి మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. డెహ్రాడూన్‌లోని సాయిబాబా ఆలయం సమీపంలో వేగంగా వచ్చిన కారు నలుగురు కార్మికులను ఢీకొట్టింది. రాజ్‌పూర్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కారు ఒక స్కూటర్‌ను ఢీకొట్టింది, అందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం, డెహ్రాడూన్ పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

రోడ్డుపై నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లిన బెంజ్ కారు.. నలుగురు మృతి, ఇద్దరికి సీరియస్!
Dehradun News[1]
Balaraju Goud
|

Updated on: Mar 13, 2025 | 7:21 AM

Share

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బుధవారం(మార్చి 12) రాత్రి డెహ్రాడూన్‌లోని రాజ్‌పూర్ రోడ్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో రోడ్డుపై పాదచారులను వేగంగా వచ్చిన కారు దూసుకుపోయింది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

బుధవారం రాత్రి రాజ్‌పూర్ రోడ్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో కొంతమంది నడుచుకుంటూ వెళుతుండగా, వేగంగా వచ్చిన బెంజ్ కారు అక్కడి నుంచి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. నడిచి వెళ్తున్న వారిని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటనా స్థలంలో అరుపులు, కేకలు మిన్నంటాయి. కారులో ఉన్న డ్రైవర్ ఏదో విధంగా కారు దిగి పారిపోయాడు. రోడ్డు పక్కన నడుస్తున్న నలుగురు కార్మికులను కారు మొదట ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీని తరువాత, రోడ్డుపై నిలబడి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పారిపోయాడు. వారు వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. కారు చాలా వేగంగా వెళుతోందని, అదుపు తప్పి నడిచి వెళ్తున్న కార్మికులను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, ఐజీ గర్హ్వాల్ రాజీవ్ స్వరూప్, ఎస్ఎస్పీ అజయ్ సింగ్, ఎస్పీ సిటీ, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నలుగురు మరణించినట్లు ప్రకటించారు. గాయపడిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిందితుడు డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారని రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ పీడీ భట్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, మెర్సిడెస్ కారు చండీగఢ్ నంబర్ కలిగి ఉంది. కారు ఆరుగురిని ఢీకొట్టిందని, వారిలో నలుగురు మరణించారని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. నిందితుడైన డ్రైవర్ కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..