Watch: ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం..ఈదురు గాలులు, వడగాళ్లకు విరిగిపడ్డ కొండచరియలు..

వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వర్షం తర్వాత థరాలిలోని రాంలీలా మైదానం సమీపంలోని గదేరా నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రాకపోకలను పునరుద్ధరించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వాహనాల్లో ఎవరూ లేరు. అందువల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ,

Watch: ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం..ఈదురు గాలులు, వడగాళ్లకు విరిగిపడ్డ కొండచరియలు..
Uttrakhand Heavy Rain

Updated on: Apr 10, 2025 | 9:42 AM

ఉత్తరాఖండ్‌లోని అనేక జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. దాదాపు మూడు గంటల పాటు ఈదరుగాలులతో కూడిన భారీ వర్షానికి చామోలి జిల్లాలో కొండచరియాలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వడగాళ్ల వానకు కొండ చరియలు విరిగి పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లాలోని థరాలిలో వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వర్షం తర్వాత థరాలిలోని రాంలీలా మైదానం సమీపంలోని గదేరా నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రాకపోకలను పునరుద్ధరించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వాహనాల్లో ఎవరూ లేరు. అందువల్ల ప్రాణ నష్టం జరగలేదు.

దాదాపు గంటన్నర పాటు కురిసిన వర్షం కారణంగా నదులు, మురుగు కాలువలు, వాగులు పొంగిపొర్లాయి. పిందార్ నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. జిల్లాలో వర్షం, వడగళ్ల వాన నష్టం నుంచి ప్రజల్ని ఆదుకునేందుకు పోలీసు యంత్రాంగం హుటాహుటినా సహాయక చర్యలకు దిగింది. సహాయ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ నెలలో కురిసిన వర్షాల కారణంగా ఉత్తరకాశిలో విపత్తు లాంటి పరిస్థితులు కనిపించాయి. గంగోత్రి హైవేపై కొండపై నుండి శిథిలాలు, రాళ్ళు పడిపోవడంతో అనేక వాహనాలు మునిగిపోయాయి. వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..