Uttarakhand Glacier Burst Updates: దేవభూమి ఉత్తరాఖండ్‌ను మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. గ్లేసియర్ బరస్ట్ ఔట్‌తో ఊహించని విధంగా ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడింది. నీటి మట్టం పెరగడంతో తపోవన్ టన్నెల్‌లో ఉన్న 16 మంది చిక్కుపోయారు. దీంతో ప్రాజెక్టులో చిక్కుపోయిన వారందరినీ ఐటీబీపీ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రమాద సమయంలో టన్నెల్‌లో ఉన్న కార్మికులంతా బురదలో చిక్కుకుయి బయటకు రాలేకపోయారు. ఐటీబీపీ సిబ్బంది సాహోసేపేతంగా సొరంగంలోకి దిగి అందులో ఉన్న వారినందరినీ బయటకు తీశారు. ప్రస్తుతం వారిని రెస్క్యూ చేసి బయటకు తీసుకువస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
కాగా.. ధౌలీ గంగా నది వరద ఉధృతి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా దాదాపు 170 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. వారంతా బురదలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. నిన్న రాత్రివేళ తగ్గిన ధౌలీ గంగా నది ఉధృతి సోమవారం తెల్లవారు జామున మళ్లీ పెరిగింది.
#WATCH | Uttarakhand: ITBP personnel carry rescued persons on stretchers who were trapped in the tunnel near Tapovan dam in Chamoli.
Visuals from earlier in the day
(Video Source: ITBP) pic.twitter.com/CTWnHfKH8C
— ANI (@ANI) February 7, 2021
Also Read: