ఉత్తరాఖండ్ లో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది జాడ ఇంకా తెలియడంలేదు. తపోవన్ టనెల్ లో ఇప్పటికీ చిక్కుబడిపోయినవారిని రక్షించేందుకు సహాయకబృందాలు నేటికీ శ్రమిస్తున్నాయి. అయితే ఇక్కడే-ఈ ప్రాంతం వద్దే పుట్టి, పెరిగి స్థానికుల అభిమానాన్ని, ప్రేమను సంపాదించుకున్న ‘బ్లాకీ’ అనే నల్ల శునకం మాత్రం రోజుల తరబడి ఇక్కడ తచ్చాడుతోంది. తనకు బిస్కట్లు, ఇతర ఆహారాన్ని పెడుతూ తన బాగోగులు చూసుకున్న తన యజమాని ఏమయ్యాడో తెలియక ఈ మూగజీవి అల్లాడుతోంది. ప్రతి రోజు ఉదయమే ఇక్కడికి వచ్చి…సాయంత్రం వరకు తిరుగాడి ఇది వెళ్ళిపోతోందని రాజేందర్ కుమార్ అనే వర్కర్ తెలిపాడు. ఈ నెల 7 న వరదలు సంభవించినప్పుడు బ్లాకీ ఇక్కడ లేదని, అయితే ఈ మధ్యే తిరిగి వఛ్చి తన యజమాని రాక కోసం ఎదురుచూపులు చూస్తోందని ఆయన చెప్పాడు. ఈ సొరంగ మార్గంలో ఈ శునక యజమానితో సహా పలువురు చిక్కుకుపోయి ఉన్నారో లేక ప్రాణాలు కోల్పోయారో తెలియడంలేదని రాజేందర్ కుమార్ అంటున్నాడు.
కాగా పలువురు జంతు ప్రేమికులు ఈ బ్లాకీ దీనావస్థను వీడియోగా చూపి ఈ మూగజీవి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
This will melt your heart. He is blackie & he is most probably waiting for his owner to be rescued from the tapovan tunnel. What a heartwarming story. Via @AFP pic.twitter.com/yVG6A58DTW
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 12, 2021
Also Read:
ISRO-Bhagavad Gita: అంతరిక్షంలోకి భగవద్గీత.. భారత జాతి గొప్పతనానికి ఇది మచ్చుతునక.. జయహో ఇండియా
Godhra Train Coach Burning Case: గోద్రా రైలు దహనం కేసు… 19 ఏళ్లకు పట్టుబడిన ప్రధాన నిందితుడు