పరీక్షల్లో కాపీలు కొడితే జీవిత ఖైదు తప్పదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హెచ్చరించారు. కల్సిలో ఆదివారం (ఫిబ్రవరి 12) జరిగిన క్రీడలు, సాంస్కృతిక ఉత్సవంలో సీఎం ధామీ ప్రసంగిస్తూ.. ‘యువత కలలతో మా ప్రభుత్వం రాజీపదు. యువత భవిష్యత్తును దెబ్బతీయడానికి ఎవరినీ అనుమతించం. ఇప్పుడు కఠినమైన కాపీయింగ్ నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. రిక్రూట్‌మెంట్ స్కామ్, పేపర్ లీకేజీల్లో ఎవరైనా పట్టుబడితే 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు, వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని ఆయన అన్నారు.
యాంటీ కాపియింగ్ ఆర్డినెన్స్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ శనివారం సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరాఖండ్ కాంపిటేటివ్ కగ్జామినేషన్ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చించి. పేపర్ లీక్ కేసులపై గత వారం పెద్ద ఎత్తున విద్యార్థుల నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులు గాయపడ్డారు. ఆ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపినట్లు సీఎం స్వయంగా ప్రకటించడం విశేషం. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ ఇప్పుడు చట్టంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.