Uttarakand UCC: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు.. పెళ్లి, ద‌త్తత, సహజీవనంపై కీలక చట్టం

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ బిల్లును ప్రవేశపెట్టారు. సహజీవనం చేస్తున్న జంటలు రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే జైలుశిక్షతో పాటు జరిమానా విధించాలన్న నిబంధన కూడా ఇందులో చేర్చించింది రాష్ట్ర సర్కార్. సహజీవనంతో జన్మించే పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని చట్టం తేల్చి చెబుతోంది.

Uttarakand UCC: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు.. పెళ్లి, ద‌త్తత, సహజీవనంపై కీలక చట్టం
Utharakand Ucc Bill

Updated on: Feb 07, 2024 | 9:45 AM

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ బిల్లును ప్రవేశపెట్టారు. సహజీవనం చేస్తున్న జంటలు రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే జైలుశిక్షతో పాటు జరిమానా విధించాలన్న నిబంధన కూడా ఇందులో చేర్చించింది రాష్ట్ర సర్కార్. సహజీవనంతో జన్మించే పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని చట్టం తేల్చి చెబుతోంది.

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో వివాదస్పద ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టారు. భార‌తీయ పౌరులు అంద‌రికీ ఒకే ర‌క‌మైన చ‌ట్టం ఉండేలా యూసీసీ బిల్లును రూపొందించారు. సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి యూసీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. పెళ్లి, విడాకులు, వార‌స‌త్వం, ద‌త్తత , సహజీవనం విషయంలో కీలక అంశాలను ఈ బిల్లులో పొందుపర్చారు. అయితే విపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో నిరసన తెలిపారు. తాము బిల్లుకు వ్యతిరేకం కాదని, కాని రాజ్యాంగబద్దంగా బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

స్వాతంత్య్రం త‌ర్వాత భారత దేశంలో కోడ్‌ను అమలు చేసే మొద‌టి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలువబోతోంది. అయితే ఇదే చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డానికి బీజేపీ పాలిత రాష్ట్రాలైన అస్సాం, రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. పోర్చుగీసు పాల‌న‌లో ఉన్న గోవాలో కూడా ఇలాంటి సివిల్ కోడ్ రూల్ చాన్నాళ్లుగా అమ‌ల్లో ఉంది. ఈ బిల్లుతో ఉత్తరాఖండ్‌ మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌. బాల్య వవివాహాలు రద్దవుతాయన్నారు. దేశంలో కూడా యూనిఫాం సివిల్‌కోడ్‌ అమలవుతుందన్న నమ్మకం ఉంది. సౌదీఅరేబియా, టర్కీ , ఇండోనేషియా, టర్కీ, ఫ్రాన్స్‌, అజర్‌బైజాన్‌, జర్మనీ, జపాన్‌ దేశాల్లో కూడా ఇదే చట్టం అమల్లో ఉంది. ఉత్తరాఖండ్‌లో ఇది ప్రారంభమవుతోందని మంత్రి సత్పాల్ వెల్లడించారు.

సహజీవనం చేస్తున్న జంట తప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న నిబంధన కూడా ఈ బిల్లులో ఉంది. మూడు నెలల పాటు సహజీవనం చేసిన జంట స్టేట్‌మెంట్ ఇవ్వకపోతే మూడు నెలల జైలుశిక్ష విధిస్తారు. లేదంటే రూ.25 వేల జరిమానా విధిస్తారు. అయితే యూసీసీ బిల్లు గిరిజనులకు వర్తించదని స్పష్టం చేశారు. బహు భార్యత్వాన్ని ఈ బిల్లు వ్యతిరేకిస్తుంది. వివాహం అయిన వ్యక్తితో సహజీవనం చేస్తే రిజిస్ట్రేషన్‌ చేయరు. పెళ్లైన జంట ఏడాది తరువాతే విడాకులు తీసుకోవాలన్న నిబంధన కూడా కొత్త బిల్లులో చేర్చింది రాష్ట్ర సర్కార్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…