వాయమ్మో.! ఏందయ్యా ఇది.. ఆయుధ పూజనా?.. వెపన్స్ దుకాణమా..?
అసలే గృహ హింస కేసు.. పైగా ఆయుధాలతో అడ్డంగా బుక్కయ్యాడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యా. దసరా ఆయుధ పూజ ఆయనకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. వందల కొద్దీ ఆయుధాలు. పిస్టల్స్, స్టన్ గన్స్, అత్యాధునిక ఆయుధాలు కూడా ఇందులో ఉన్నాయి.

అసలే గృహ హింస కేసు.. పైగా ఆయుధాలతో అడ్డంగా బుక్కయ్యాడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యా. దసరా ఆయుధ పూజ ఆయనకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. వందల కొద్దీ ఆయుధాలు. పిస్టల్స్, స్టన్ గన్స్, అత్యాధునిక ఆయుధాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఓ సాధారణ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటివి. దసరా ఆయుధ పూజ సందర్భంగా.. దాదాపు 200కు పైగా ఆయుధాలను పేర్చి పూజ నిర్వహించారు. ఇప్పుడిదే వీడియో యూపీలో వైరల్ అయింది. ఇలా బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శించడంపై వివాదం చెలరేగింది.
యూపీ ప్రతాప్‌గఢ్ జిల్లా కుందా ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజాభయ్యా ఆయుధాలే ఇవి. రాజాభయ్యా భార్య భన్వీసింగ్.. భర్తపై ఇప్పటికే గృహ హింస కేసు పెట్టడంతో పాటు.. ఆయుధాల నిల్వపై స్వయంగా హోం మినిస్టర్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఇన్నాళ్లు అలాంటిదేం లేదని కవర్ చేస్తూ వచ్చిన రాజాభయ్యా.. ఇప్పుడు ఆయుధ పూజతో అడ్డంగా బుక్కయ్యారు. భార్య భన్వీ ఆరోపణలు నిజం అయ్యాయి.
ఇవన్నీ తనవీ, తన అనుచరులవే అంటున్నారు ఎమ్మెల్యే రాజాభయ్యా. తన రక్షణ కోసం వీటిని పెట్టుకున్నా అని చెబుతున్నా, 200కు పైగా ఆయుధాలుండటంపై పోలీసులు నజర్ పెట్టారు. ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?. వీటన్నింటికి పర్మిట్ ఉందా లేదా అనేది తెలుసుకుంటున్నారు. మొత్తానికి.. ఆయుధ పూజ ఎమ్మె్ల్యే రాజాభయ్యాకు కొత్త తంటాలు తెచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
