
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగిన తిరంగా యాత్రలో తీవ్ర కలకలం చెలరేగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న త్రివర్ణ యాత్రలో కొందరు దుర్మార్గులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీలతో తరిమికొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సహరన్‌పూర్‌లోని నానౌటా పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా, త్రివర్ణ యాత్రను నానౌటా పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. ఇంతలో కొందరు తుంటరి యువకులు చేరి ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించారు. త్రివర్ణ పతాక యాత్ర సందర్భంగా భద్రత కోసం పనిచేస్తున్న పోలీసు సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలను ప్రయోగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
త్రివర్ణ పతాక యాత్రలో కలకలం సృష్టించిన నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నారు. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరంగా యాత్రలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు దేశభక్తి గీతాలకు నృత్యాలు చేశారు. ఇరువర్గాలను రెచ్చగొడుతూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రచ్చ సృష్టించడం ప్రారంభించారు. ర్యాలీ కొంత దూరం వెళ్ళింది. దీంతో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. అయితే సకాలంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలతో దుండగులను అక్కడి నుంచి తరిమేశారు. ఎస్పీ దేహత్ సాగర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. త్రివర్ణ యాత్రకు అంతరాయం కలిగించిన వారిని పోలీసులు తరిమికొట్టారు. ప్రస్తుతం నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..