అందరికంటే ముందే నిద్రలేచిన ఐదేళ్ల చిన్నారి.. 8వ అంతస్తులో బాల్కనీ ఎక్కి తొంగిచూస్తుండగా..

|

Jun 16, 2023 | 4:54 PM

ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌లోని 8వ ఫ్లోర్‌ బాల్కనీ నుంచి కింద పడి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శుక్రవారం (జూన్ 16) ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

అందరికంటే ముందే నిద్రలేచిన ఐదేళ్ల చిన్నారి.. 8వ అంతస్తులో బాల్కనీ ఎక్కి తొంగిచూస్తుండగా..
Boy Fell Down From Balcony
Follow us on

నోయిడా: ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌లోని 8వ ఫ్లోర్‌ బాల్కనీ నుంచి కింద పడి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శుక్రవారం (జూన్ 16) ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని హైడ్ పార్క్ సొసైటీ అపార్ట్‌మెంట్ వద్ద తెల్లవారుజామున 5:45 గంటలకు ఈ ఘటన జరిగింది. హుటాహుటీన చిన్నారిని సెక్టార్‌ 71లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించిన ఫలితంలేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన సమయంలో చిన్నారి తల్లిదండ్రులు నిద్రిస్తున్నారని పోలీసులు తెలిపారు.

కొన్నిసార్లు చిన్నారి తమ కంటే ముందే నిద్రలేచి ఇంట్లో తిరుగుతుంటాడని, ఈ రోజు కూడా తమ కంటే ముందే నిద్రలేచిన బాలుడు బాల్కనీ గ్రిల్‌ ఎక్కి కిందపడిపోయి మృతి చెందినట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఓ పోలీసులధికారి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.