Viral: కిడ్నీ సమస్యతో ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడికి అల్ట్రాసౌండ్.. రిపోర్టు చూసి డాక్టర్లు షాక్

|

Feb 27, 2023 | 2:39 PM

కిడ్నీ ప్రాబ్లమ్‌తో ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధుడి రిపోర్ట్స్ చూసిన వైద్యులు కంగుతిన్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Viral: కిడ్నీ సమస్యతో ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడికి అల్ట్రాసౌండ్.. రిపోర్టు చూసి డాక్టర్లు షాక్
Uterus In Stomach
Follow us on

బిహార్​లోని ఛప్రా గవర్నమెంట్ హాస్పిటల్‌లో స్టన్నింగ్ ఘటన వెలుగుచూసింది. కిడ్నీ సమస్యతో ఆస్పత్రికి వచ్చిన ఓ 60 వృద్ధుడికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా కడుపులో గర్భాశయం ఉన్నట్లు రిపోర్టులో తేలింది. దీంతో ఒక్కసారిగా డాక్టర్లంగా స్టన్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఛప్రాలోని కార్పెంటర్ మియాన్ అనే 60 ఏళ్ల వృద్ధుడికి కిడ్నీ సమస్య వచ్చింది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అతడిని దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. దీంతో డాక్టర్లు అతడికి అల్ట్రాసౌండ్​ స్కానింగ్ టెస్ట్ చేశారు. అనంతరం రిపోర్ట్స్ చూసిన డాక్టర్లు స్టన్ అయ్యారు. వృద్ధుడి పొట్టలో గర్భాశయం ఉన్నట్లు ఆ స్కానింగ్ రిపోర్టులో వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వృద్ధుడి ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రిపోర్టు చూసిన డాక్టర్లంతా ఈ సంఘటనకు నిర్ఘాంతపోయి.. అతడికి మళ్లీ మెడికల్ టెస్టులు చేయించాలని సూచించారు. అనంతరం వృద్ధుడికి మరోసారి టెస్టులు చేయగా.. అతడి కడుపులో గర్భాశయం ఉన్నట్లు  ధృవీకరణ అవ్వలేదు. దీంతో  కుటుంబ సభ్యులు శాంతించారు.

ఈ విషయం పై మాట్లాడిన డాక్టర్లు రిపోర్ట్స్ తారుమారై ఉండొచ్చని వివరణ ఇచ్చారు. ఇది కేవలం మాన్యువల్‌గా జరిగిన మిస్టేక్ తప్ప స్కానింగ్​లో ఎలాంటి పొరపాటు లేదని వెల్లడించారు. ఒక మహిళ సిటీ స్కాన్​లో ఉన్న అంశాలన్నీ ఆ రిపోర్టులో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆ రిపోర్ట్స్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నామని డాక్టర్​ సంతోష్ కుమార్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..