AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD Vance India Visit: అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కుటుంబం..

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో.. భారత, అమెరికా సంబంధాలు గతంలో కంటే బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. భారత్‌లో నాలుగు రోజులు పర్యటనలో భాగం అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌ భారత్ కు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా భారత్‌కు వచ్చిన వాన్స్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు జేడీ వాన్స్‌..

JD Vance India Visit: అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కుటుంబం..
Jd Vance India Visit
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2025 | 1:37 PM

Share

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో.. భారత, అమెరికా సంబంధాలు గతంలో కంటే బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. భారత్‌లో నాలుగు రోజులు పర్యటనలో భాగం అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌ భారత్ కు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా భారత్‌కు వచ్చిన వాన్స్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు జేడీ వాన్స్‌.. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్‌కు వచ్చారు జేడీ వాన్స్‌.. సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో వాన్స్‌ ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇందులో అమెరికా టారిఫ్‌లపైనా చర్చించే అవకాశముంది. ఇక రాత్రి జేడీ వాన్స్‌ దంపతులకు మోదీ విందు ఇవ్వనున్నారు.. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వాన్స్‌ దంపతులు ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌లో పర్యటించనున్నారు.

భారత పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్, వారి పిల్లలు – ఇవాన్, వివేక్, మిరాబెల్ మొదటగా న్యూఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్‌ను సందర్శించారు. భారతదేశ వారసత్వం, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింభంగా అద్భుతమైన కళతో నిర్మించిన అక్షరధామ్ ఆలయాన్ని చూసి మంత్రముగ్దులయ్యారు. అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో పొందుపరచబడిన సామరస్యం, కుటుంబ విలువలు, కాలాతీత జ్ఞానం సందేశాలను వారు అభినందించారు.

ఈ సందర్శన భారతదేశం – యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న విశ్వాసం, శాంతి, ఐక్యత ఉమ్మడి విలువలను సూచిస్తుంది.

అతిథి పుస్తకంలో తన అనుభవాన్ని పంచుకుంటూ, US ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇలా రాశారు:

“ఈ అందమైన ప్రదేశానికి నన్ను – నా కుటుంబాన్ని స్వాగతించడంలో మీ ఆతిథ్యం.. దయకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఖచ్చితత్వం, శ్రద్ధతో అందమైన ఆలయాన్ని నిర్మించడం భారతదేశానికి గొప్ప ఘనత. ముఖ్యంగా మా పిల్లలు దానిని ఇష్టపడ్డారు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు” అంటూ రాశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..