UPSC: దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! వైరల్‌గా మారిన యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్‌..

|

Apr 19, 2024 | 3:35 PM

ఇటీవల విడుదలైన సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో ఫెయిల్ అయిన అభ్యర్థి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవును, అతడి పోస్ట్‌ వైరల్ కావడానికి ప్రధాన కారణం అతడు చేసిన ప్రయత్నాలు. UPSC ఎగ్జామ్‌ కోసం అతడు 12సార్లు అటెమ్ట్‌ చేశాడు. అందులో 7 సార్లు మెయిన్స్‌ వరకు వెళ్లాడు. 5 టైమ్స్ అతడు ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు..కానీ, సెలెక్ట్‌ కాలేదు.

UPSC: దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! వైరల్‌గా మారిన యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్‌..
Upsc Civil Services
Follow us on

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలను ప్రకటించింది. ఇందులో ఆదిత్య శ్రీవాస్తవ టాప్ ర్యాంక్ సాధించారు. అనిమేష్ ప్రధాన్, డోనూరు అనన్యారెడ్డి వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ CSEకి అర్హత సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు వెల్లువెత్తాయి.. కానీ ఈ పరీక్ష ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేని అభ్యర్థుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల విడుదలైన సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో ఫెయిల్ అయిన అభ్యర్థి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవును, అతడి పోస్ట్‌ వైరల్ కావడానికి ప్రధాన కారణం అతడు చేసిన ప్రయత్నాలు. UPSC ఎగ్జామ్‌ కోసం అతడు 12సార్లు అటెమ్ట్‌ చేశాడు. అందులో 7 సార్లు మెయిన్స్‌ వరకు వెళ్లాడు. 5 టైమ్స్ అతడు ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు..కానీ, సెలెక్ట్‌ కాలేదు.

యుపిఎస్‌సి టాపర్‌ల విజయ కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మొదటి తరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కునాల్ ఆర్.విరుల్కర్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. సెలెక్ట్‌ కాలేకపోయిన విద్యార్థులకు అదో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తోంది. 12 సార్లు ప్రయత్నించిన ఆర్‌ విరుల్కర్‌ ఏడుసార్లు మెయిన్స్‌ వరకు వెళ్లాడు. 5 సార్లు ఇంటర్వ్యూకు సెలెక్ట్‌ అయ్యాడు. కానీ, దురదృష్టం సెలెక్ట్‌ కాలేదని చెప్పారు. ఈ పోస్ట్‌లో అతడు తన అనుభవాన్ని పంచుకుంటూ..జీవితానికి మరోపేరు సంఘర్షణ(పోరాటం) అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను షేర్ చేసిన కొద్ది సమయంలో 1.2 మిలియన్ సార్లు వీక్షించబడింది. 19,000 మందికి పైగా లైక్‌ చేశారు. మీ పోరాటం, పట్టుదల గురించి వివరించడానికి పదాలు సరిపోవు మీరు ఎప్పటికైనా గెలుస్తారంటూ నెటిజన్లు అతన్ని ప్రశంసించారు.
ఈ వ్యక్తి పోరాట యాత్రను అభినందిస్తూ నిర్మాత వినోద్ కప్రి స్పందించారు. ఇది హృదయ విదారకం అంటూ వ్యాఖ్యానించారు. మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు.

సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటి. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు సివిల్ సర్వీసెస్ పరీక్షకు అర్హత సాధించడం చాలా ప్రతిష్టాత్మకమైన పరీక్షగా పరిగణించబడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..