
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరూ పాపులర్ అవ్వాలని చూస్తున్నారు. ఎలాగైనా రాత్రిరాత్రికి సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారు. దీంతో క్షణాల్లో వైరల్ అయ్యేలా వీడియోలను రూపొందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో నెట్టింట నిలవాలని చూస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడు ఇలాగే ఓవర్ నైట్‌లో సెలబ్రిటీ అవ్వాలనుకున్నాడు. అయితే ఆ యువకుడికి చివరల్లో ఊహించని షాక్ ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన రజా అహ్మద్ అనే యువకుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా కానా స్టేడియంలో కారుపై నిల్చొని హుక్కా కొడుతూ వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసుల కంట పడింది.
थाना सुशान्त गोल्फ सिटी पुलिस द्वारा इकाना स्टेडियम के पास कार के ऊपर हुक्का पीकर रील बनाने वाले वांछित अभियुक्त को किया गया गिरफ्तार।#be_Responsible pic.twitter.com/1TjKJ67JHA
— LUCKNOW POLICE (@lkopolice) February 23, 2023
ఇంకేముంది ఆ యువకుడిని పట్టుకునేందుకు వెంటనే రంగలోకి దిగారు పోలీసులు. వీడియోలో కనిపిస్తోన్న కారు నెంబర్ ఆధారంగా యువకుడిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రూ. 7500 జరిమానా విధించి కారును కూడా సీజ్ చేశారు. ఇలా చట్ట విరుద్ధంగా ఎవరూ వ్యవహరించినా రియాక్షన్ ఇలాగే ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..