Viral Video: రోడ్డుపై ధాన్యం ఎత్తిన పోలీస్.. మీరే మా హీరోలంటూ మెచ్చుకుంటున్న నెటిజన్లు

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. పోలీసుల మానవతాదృక్పదానికి సంబంధించి ఈ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి వారు ప్రజలకు మరింత మంది అవసరమని పలువురు వ్యాఖ్యానించారు.

Viral Video: రోడ్డుపై ధాన్యం ఎత్తిన పోలీస్.. మీరే మా హీరోలంటూ మెచ్చుకుంటున్న నెటిజన్లు
Up Meerut Police

Updated on: Apr 03, 2023 | 5:23 PM

పోలీసులంటే ప్రజల్లో ఎప్పుడూ తప్పుడు అభిప్రాయమే ఉంటుంది. దీనికి కారణం కొందరు ఖాకీల ప్రవర్తనే అని అందరికీ తెలిసిందే. అయితే, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మానవతా దృక్పథం ఉన్నవారే చాలా ఎక్కువ మంది ఉంటారు. పోలీసుల ఔదార్యం, ఎదుటివారికి వారికి సాయం చేసే గుణం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వార్తలు,వీడియోలు గతంలో చాలానే చూశాం. అయితే, తాజాగా కొందరు పోలీసులు ఒక వృద్ధుడికి చేసిన సాయం అందరినీ ఆకట్టుకుంటోంది.. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్‌ లో జరిగింది. ఆ క్రమంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి వీడియో తీయగా…దీన్ని యూపీ పోలీసులు వారి ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. పోలీసుల మానవతాదృక్పదానికి సంబంధించి ఈ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ వృద్ధుడు ధాన్యం సంచితో వెళ్తుండగా, అది జారి కిందపడిపోయింది. దాంతో సంచిలో ధాన్యం మొత్తం నేలపాలైంది. ఈ సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకల రద్దీ కొనసాగుతోంది. కాగా, ఆ వృద్ధుడు ధాన్యం సేకరించేందుకు నానాతంటాలు పడుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు రైతుకు అండగా నిలిచారు. కొందరు పోలీసులు వాహనాలను అడ్డుకుని ధాన్యంపై వెళ్లకుండా అడ్డుకోగా, కొందరు పోలీసులు వృద్ధుడికి సాయం చేశారు. కిందపడ్డ ధాన్యం ఎత్తటంలో సహకరించారు. ఈ వీడియోను UP POLICE అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. మీరట్ పోలీసుల మానవతా దృక్పథం ఇది.

ఇవి కూడా చదవండి

రోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్తుండగా.. పోలీసులు వాహనాలను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో వృద్ధుడు ధాన్యాన్ని పోగు చేస్తుండగా, మరో ఇద్దరు పోలీసులు అతనికి సహాయం చేశారు. అంతేకాదు, అతడిని క్షేమంగా ఇంటికి చేర్చారు.

ఈ వీడియోను 7 లక్షల మందికి పైగా వీక్షించారు. అలాగే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు పోలీసుల పని తీరును అభినందిస్తున్నారు. ఇలాంటి వారు ప్రపంచానికి మరింత మంది అవసరమని పలువురు వ్యాఖ్యానించారు. మరికొందరు మీరే హీరోలు అంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా మంచి పని.. మాకు ఇలాంటి పోలీసులే కావాలి అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది హృదయాన్ని హత్తుకునే సంఘటన అని, హీరోలకు నిజమైన నిర్వచనం అంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు.