ఎవరైనా ఇప్పుడు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలోకి వెళితే అక్కడ ఉన్నవారిని చూసి పూజారులు అనుకుని మోసపోకండి. ఎందుకంటే అతను పూజారి లేదా పోలీసు కావచ్చు. బహుశా ఇలా చెప్పడం వలన కొంచెం వింతగా ఫీల్ కావొచ్చు. అయితే వాస్తవానికి ఇది పూర్తిగా నిజం. ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారుల వేషధారణలో కొంతమంది పోలీసులను మోహరించారు. వారణాసి పోలీసు డ్రెస్ కోడ్ మారింది. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ తీసుకున్న నిర్ణయంపై ఉత్తరప్రదేశ్లో రాజకీయనేతలు తీవ్ర విమర్శలు మొదలు పెట్టారు.
పోలీసు సిబ్బంది యూనిఫారానికి బదులు పూజారులు ధరించాల్సిన దుస్తులను ధరించే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరి మదిలో తలెత్తే ప్రశ్నలు. అసలు కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను మోహరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అని అనుకుంటుంటే.. డ్రెస్ కోడ్ ను మార్చడం వెనుక ఉన్న రీజన్ గురించి తెలుసుకుందాం..
వారణాసి పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఒకే షిప్టులో 6 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వీరందరికీ గర్భగుడి బాధ్యతలను అప్పగించారు. వీరిలో ఇద్దరు పోలీసులు కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో అర్చకుల వేషధారణలో ఉంటారు. మిగిలిన నలుగురు పోలీసులు గర్భగుడిలోని వివిధ ద్వారాల వద్ద మోహరించనున్నారు.
వారణాసి కమిషనరేట్ నిర్ణయంపై ఇప్పుడు యూపీలో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తొలి పోస్ట్ చేశారు. పోలీసులు పూజారుల వేషం ధరించడం ఏ ‘పోలీస్ మాన్యువల్’ ప్రకారం సరైనదని ఆయన ట్వీట్లో ప్రశ్నించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చే వారిని సస్పెండ్ చేయాలి. రేపు ఏ దుండగుడైనా దీన్ని సద్వినియోగం చేసుకుని అమాయక ప్రజానీకాన్ని లూటీ చేస్తే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పరిపాలన ఏమి సమాధానం చెబుతుంది.. ఇది ఖండించదగిన చర్య అంటూ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..