Lakhimpur Kheri violence: యోగీ సర్కారు నష్ట నివారణ చర్యలు.. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 45 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

|

Oct 04, 2021 | 1:46 PM

ఉత్తరప్రదేశ్‌ లోని లఖీంపూర్‌ ఖేరీలో ఉద్రిక్తతను తగ్గించడానికి యోగి సర్కార్‌ నష్టనివారణ చర్యలు చేపట్టింది. రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు

Lakhimpur Kheri violence: యోగీ సర్కారు నష్ట నివారణ చర్యలు..  చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 45 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
Lakhimpur Kheri
Follow us on

Lakhimpur Kheri – UP: ఉత్తరప్రదేశ్‌ లోని లఖీంపూర్‌ ఖేరీలో ఉద్రిక్తతను తగ్గించడానికి యోగి సర్కార్‌ నష్టనివారణ చర్యలు చేపట్టింది. రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెసయ్యాయి. చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. రైతుల సంఘాలు మాత్రం ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

కాగా, ఇవాళ యూపీ లఖీంపూర్‌ ఖేరీలో హై టెన్షన్‌ నెలకొంది. నిన్న రైతుల ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న విపక్ష సభ్యులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. బారికేడ్లు, వాహనాలను అడ్డుగా పెట్టి భారీగా బలగాలను మోహరించారు. లఖీంపూర్‌ఖేరీలో 144 సెక్షన్‌ విధించారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. లఖీంపూర్‌ ఘటనతో ఢిల్లీలోనూ ఆంక్షలు విధించారు. సింఘు, ఘాజీపూర్‌ సరిహద్దులను మూసివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

ఇక ఇటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణమేర్పడింది. లఖీంపూర్‌ఖేరీకి వెళ్తుండగా అఖిలేష్‌ను ఇంటివద్దే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ టెన్షన్‌ టెన్షన్‌ నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా పెద్ద సంఖ్యలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. పోలీస్‌ వాహనానికి నిప్పు పెట్టారు. మరోవైపు కేంద్రమంత్రి రాజీనామా చేయాలని .. మృతుల కుటుంబాలకు 2కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు అఖిలేష్‌ యాదవ్‌.

మరోవైపు లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కారు నడిపారన్న ఆరోపణలపై కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఆశిష్‌ మిశ్రా సహా 14మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. లఖీంపూర్‌ఖేరీలో రైతులకు మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఆమెకు భరోసాగా రాహుల్‌గాంధీ ఓ ట్వీట్‌ పెట్టారు. నీ ధైర్యం ముందు వాళ్లంతా వెనక్కి తగ్గారు. పోరాడుతున్న రైతులను మనం గెలిపిద్దామంటూ ట్వీట్‌ చేశారు.

Read also: MP Rammohan Naidu: నవరత్నాలు కావవి.. బూడిద రత్నాలు.. బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నారు