బీజేపీ యాడ్ లో ఉన్నావ్ అత్యాచార నిందితుడు..

|

Aug 16, 2019 | 4:59 PM

ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితుడు, ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఫొటో ఓ న్యూస్ పేపర్ ప్రకటనలో ఉండటం కలకలం రేపుతోంది. స్వాతంత్య దినోత్సవం, రక్షాబంధన్ ప్రకటనల్లో బీజేపీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఆయన ఫొటోను వాడటం సంచలనంగా మారింది. ఏకంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కలిసి ప్రముఖ హిందీ పత్రికలో కనిపించడం చర్చనీయాంశమైంది. బిజెపి నాయకుడు, ఉన్నావ్ నగర్ పంచాయతీ చీఫ్ అనుజ్ దీక్షిత్ […]

బీజేపీ యాడ్ లో ఉన్నావ్ అత్యాచార నిందితుడు..
Follow us on

ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితుడు, ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఫొటో ఓ న్యూస్ పేపర్ ప్రకటనలో ఉండటం కలకలం రేపుతోంది. స్వాతంత్య దినోత్సవం, రక్షాబంధన్ ప్రకటనల్లో బీజేపీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఆయన ఫొటోను వాడటం సంచలనంగా మారింది. ఏకంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కలిసి ప్రముఖ హిందీ పత్రికలో కనిపించడం చర్చనీయాంశమైంది.

బిజెపి నాయకుడు, ఉన్నావ్ నగర్ పంచాయతీ చీఫ్ అనుజ్ దీక్షిత్ ఈ ప్రకటనను వేయించారు. దీనిపై స్పందించిన ఆయన..మా ప్రాంత ఎమ్మెల్యే కాబట్టి ప్రకటనలో ఫొటో పెట్టామని..పదవిలో ఉన్నంతవరకు ఆయన మా ఎమ్మెల్యేనని అన్నారు. పార్టీ ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి కూడా  సెంగార్ తో పాటు అగ్ర నేతల ఫొటోలను ప్రచురించడంలో తప్పు లేదన్నారు. ఎందుకంటే అత్యాచారం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని, నేరం రుజువు కాలేదన్నారు. కాగా బీజేపీ నేతలు సెంగార్ ను వెనకేసుకురావడం కొత్తేం కాదు. అన్న కష్టాల్లో ఉన్నాడు. ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నామంటూ ఇటీవల హర్దోయ్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడారు. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ సైతం జూన్ లో సీతాపూర్ జైలుకు వెళ్లి మరీ సెంగార్ ను కలుసుకున్నారు.

ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న సెంగార్ పై అత్యాచారం, హత్య  ఆరోపణలతో పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. గత నెల 28న ఉన్నావ్ బాధితురాలు ప్రమాదానికి గురైన ఘటనపై ప్రస్తుతం సీబీఐ సెంగార్ ను విచారిస్తోంది.  ఈ ఘటనలో బాధితురాలు ఎయిమ్స్ లో మృత్యువుతో పోరాడుతోంది.