అన్ లాక్ 4.0, తమిళనాడులో కొత్త మార్గదర్శకాలతో అమలు

| Edited By: Anil kumar poka

Aug 31, 2020 | 11:01 AM

తమిళనాడులో సెప్టెంబరు నుంచి  అన్ లాక్ 4.0  ని పురస్కరించుకుని నూతన మార్గదర్శక సూత్రాలను విడుదల చేశారు. రేపటి నుంచి షాపులను రాత్రి 8 గంటలవరకు తెరచి ఉంచడానికి అనుమతించారు.

అన్ లాక్ 4.0, తమిళనాడులో కొత్త మార్గదర్శకాలతో అమలు
Follow us on

తమిళనాడులో సెప్టెంబరు నుంచి  అన్ లాక్ 4.0  ని పురస్కరించుకుని నూతన మార్గదర్శక సూత్రాలను విడుదల చేశారు. రేపటి నుంచి షాపులను రాత్రి 8 గంటలవరకు తెరచి ఉంచడానికి అనుమతించారు. ఆదివారాలు మొత్తం లాక్ డౌన్ ని ఎత్తివేస్తున్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం ఉద్యోగులతో పని చేయవచ్చు. అయితే ఐటీ రంగానికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్షన్  వెసులుబాటు సౌకర్యాన్ని కల్పిచారు, సినిమా షూటింగులకు 75  మందితో అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. రిక్రియేషన్ క్లబ్బులను, చిల్డ్రన్ పార్కులను కూడా అనుమతించారు. ఇప్పటివరకు తమిళనాట ముఖ్యంగా ఆదివారాలు పూర్తి లాక్ డౌన్ విధించడంతో ప్రజల ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. అయితే ఇక అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ అమలులోకి రాబోతున్నాయి గనుక ఇక వారి ఇబ్బందులు తొలగినట్టే!