‘రాహుల్ జీ ! అలాంటి ప్రశ్నలు అడగవద్దు’…. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

లడఖ్ లో చైనా మన భూభాగాలను ఆక్రమించుకుందా అని అడిగిన తన ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నారని, 'సీన్ నుంచి మాయమయ్యారని' కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్

రాహుల్ జీ ! అలాంటి ప్రశ్నలు అడగవద్దు.... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

Edited By:

Updated on: Jun 10, 2020 | 4:15 PM

లడఖ్ లో చైనా మన భూభాగాలను ఆక్రమించుకుందా అని అడిగిన తన ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నారని, ‘సీన్ నుంచి మాయమయ్యారని’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటరిచ్చా రు. అంతర్జాతీయ అంశాలపై రాహుల్ ట్విట్టర్లో ఇలాంటి ప్రశ్నలు అడగరాదని ఆయన కోరారు. చైనా వంటి ఇంటర్నేషనల్ విషయాల మీద ట్విట్టర్లో ప్రశ్నలు అడగరాదని తెలుసుకోండి.. బాలాకోట్ వైమానిక దాడులపైనా, 2016 లో యూరి సెక్టార్ లో జరిగిన ఎటాక్ ల మీద కూడా మీరు ఇలాగే గతంలో అడిగారు అని ఆయన పేర్కొన్నారు.కాగా- గత శనివారం భారత-చైనా దేశాల మధ్య సైనిక స్థాయిలో జరిగిన చర్చల్లో చైనా తీవ్రంగా స్పందించిందని అంటూ వఛ్చిన ఓ న్యూస్ ఆర్టికల్ ని కూడా రాహుల్ తన ట్వీట్ కి జత చేశారు. కానీ సామాజిక మాధ్యమాల్లో ఈ విధమైనఅంతర్జాతీయ అంశాలెందుకని రవిశంకర్ ప్రసాద్ మళ్ళీ ఆయన్ను ప్రశ్నించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us