Nitin Gadkari Threat Call: కేంద్ర రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరికి హత్య బెదిరింపులు వచ్చాయి. నాగ్‌పూర్ లోని గడ్కరి కార్యాలయానికి కాల్ చేసిన గుర్తు తెలియని దుండగులు చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు రెండు సార్లు బెదిరింపు కాల్‌లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దావూద్ పేరుతో బెదిరింపులు వచ్చాయని తెలిపారు. గడ్కరి కార్యాలయానికి ఫోన్ చేసిన దుండగులు.. 100 కోట్లు ఇవ్వాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డబ్బులు ఇవ్వనందుకు చంపేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే గడ్కరి నాగ్‌పూర్ కార్యాలయానికి భద్రతను పెంచారు.
శనివారం (జనవరి 14) ఉదయం నుంచి రెండు సార్లు బెదిరింపు కాల్‌లు వచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 11.30, 11.40 కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే నాగపూర్ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రజా సంబంధాల కార్యాలయం వెలుపల నాలుగు ఫోన్ నంబర్లను ఉంచారు. ఈ నంబర్లకు ఉదయం నుంచి మూడుసార్లు ఫోన్లు వచ్చాయి.
Maharashtra | Union Minister Nitin Gadkari’s office in Nagpur received two threatening calls at 11.30 am and 11.40 am. Further investigation is going on: Nagpur Police
— ANI (@ANI) January 14, 2023
సమాచారం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులతో పాటు ఏటీఎస్ బృందం గడ్కరీ కార్యాలయానికి చేరుకుంది. దీనికి సంబంధించి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) బృందం పలు వివరాలను సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఎవరైనా ఆకతాయిలు ఫోన్ చేశారా..? లేక దీని వెను ఉగ్రవాదులున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Maharashtra | Union Minister Nitin Gadkari’s office in Nagpur received two threatening calls this morning. Nagpur Police say that further investigation is going on.
Visuals from outside the Minister’s office. pic.twitter.com/BMgcANvUOO
— ANI (@ANI) January 14, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..