Shekawat PC: రాష్ట్రం ఆలస్యానికి మమ్మల్ని బాధ్యులను చేయొద్దు.. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి షెకావత్ కౌంటర్

|

Nov 11, 2021 | 7:32 PM

ఏడు సంవత్సరాలైనా కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరా అని కేంద్రాన్ని నిలదీశారు సీఎం కేసీఆర్. మీ ఆలస్యానికి మాదా బాధ్యత అంటూ కౌంటర్ ఇచ్చారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

Shekawat PC: రాష్ట్రం ఆలస్యానికి మమ్మల్ని బాధ్యులను చేయొద్దు.. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి షెకావత్ కౌంటర్
Union Minister, Gajendra Singh Shekawat, Cm Kcr, Ap, Telangana, Water Dispute
Follow us on

Union Minister Gajendra Singh Shekawat on CM KCR: ఏడు సంవత్సరాలైనా కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరా అని కేంద్రాన్ని నిలదీశారు సీఎం కేసీఆర్. మీ ఆలస్యానికి మాదా బాధ్యత అంటూ కౌంటర్ ఇచ్చారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదానికి సంబంధించి వివరించారు.

ఇరు రాష్ట్రాలతో అనేక సార్లు చర్చించిన తర్వతే KRMB, GRMB పరిధి నిర్ణయించామన్నారు షెకావత్. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇలా మాట్లాడటం ఓ డ్రామా అన్నారు. ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేయడమే అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో నా పేరు ప్రస్తావించారు. ఆయన లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు కేంద్ర మంత్రి షెకావత్. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై 2015లో సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని అడిగారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకూడదన్న మంత్రి.. పలుమార్లు కోరినా పిటిషన్ వెనక్కి తీసుకోలేదన్నారు. కొద్ది రోజుల రోజుల క్రితమే సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగిందన్నారు.

రెండు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారాని ఏర్పడ్డ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా చాలా రోజుల పాటు జరగలేదన్నారు. 2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందని, సీఎం కేసీఆర్ మరోసారి కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తీసుకొచ్చారు. నీటి పంపకం, విద్యుత్ అంశాల్లో ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వాటిని పరిష్కరించాలని ప్రధాని మాకు చెప్పారు. ఈ క్రమంలో విభజన చట్టం ప్రకారం గెజిట్ పరిధి నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారు. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

బోర్డులకు నియంత్రణ అప్పగిస్తే వివాదాలకు ఆస్కారం లేకుండా నీటి పంపిణీ సాగుతుందని మంత్రి షెకావత్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్ట్‌లను బోర్డులకు అప్పగించాలి. నియంత్రణ బోర్డుల చేతిలో పెట్టాలి. కాగా, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం న్యాయశాఖకు పంపించాము. కొత్తది ఏర్పాటు చేయాలా లేక పాత దాన్నే కొనసాగించాలా అన్నది నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. బోర్డుల కోసం మేము ఆల్రెడీ డేట్ ఇచ్చాము. ఇలోగా బోర్డుల నిర్వహణకు తగిన వసతులు కల్పించాల్సిన అవసరముందన్నారు. బోర్డుల నిర్వహణకు పరస్పర అంగీకారంతో వాయిదా వేయడానికి అభ్యంతరం లేదు. పరస్పరం చర్చల ద్వారా అమలు చేయాలన్నారు. విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్న మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌.. నోటిఫికేషన్ లో పూర్తి స్పష్టత ఉందన్నారు.

Read Also…  Andhra Pradesh: భూమిలోంచి వింత శబ్ధాలు.. చిత్తూరు జిల్లా వాసులు హడల్‌!