కాంగ్రెస్‌ ర్యాలీ పూర్తిగా విఫలమైంది: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామ్ లీలా మైదాన్ కాంగ్రెస్ ర్యాలీని విఫలమని విమర్శించారు. రాహుల్ గాంధీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 'ఓట్ చోరీ' వాదనను వాడుకుంటున్నారని ఆరోపించారు. వంద ఎన్నికల వైఫల్యాల తర్వాత కూడా నాయకుడి గా సమర్థించుకోవడాన్ని విమర్శించారు.

కాంగ్రెస్‌ ర్యాలీ పూర్తిగా విఫలమైంది: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
Kishan Reddy

Updated on: Dec 14, 2025 | 9:43 PM

రామ్ లీలా మైదానంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ర్యాలీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్‌లో బీజేపీని ఎదుర్కొలేక కాంగ్రెస్‌ ఓట్‌ చోరీ అనే అంశాన్ని తెరపైకి తెస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ తన వైఫల్యాన్ని దాచడానికి, ఓట్‌ చోరీ అనే సాకును వాడుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. దాదాపు పలు ఎన్నికల వైఫల్యాల తర్వాత కూడా రాహుల్ గాంధీ తనను తాను నాయకుడిగా ఎలా సమర్థించుకోగలుగుతారని ప్రశ్నించారు.

ఓట్‌ చోరీ లాంటి అంశాలు కేవలం తన నాయకత్వాన్ని ఆ పార్టీ క్యాడర్‌ ప్రశ్నించకుండా ఉండేందుకు మాత్రమే అని ఆరోపించారు. మొత్తంగా రామ్‌ లీలా మైదానంలో కాంగ్రెస్‌ చేసిన ర్యాలీని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై కూడా కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్‌లోని సభ్యులపై దాడి చేస్తూనే, రాజ్యాంగ కార్యకర్తలను బెదిరించి, వారి విధులను నిర్వర్తించకుండా నిరోధించడం ద్వారా ఆమె హిట్ లిస్ట్‌ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి