అబ్బ రోడ్లే రోడ్లు.. భారీ కారిడార్‌కు ఆమోదం.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు నేషనల్‌ హైవే ప్రాజెక్ట్‌లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో నాసిక్‌-సోలాపూర్‌ కారిడార్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 374 కిలోమీటర్ల మేర కారిడార్‌ నిర్మాణం జరుగుతుందని కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

అబ్బ రోడ్లే రోడ్లు.. భారీ కారిడార్‌కు ఆమోదం.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
Project In Southern Odisha

Updated on: Dec 31, 2025 | 6:42 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు నేషనల్‌ హైవే ప్రాజెక్ట్‌లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో నాసిక్‌-సోలాపూర్‌ కారిడార్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 374 కిలోమీటర్ల మేర కారిడార్‌ నిర్మాణం జరుగుతుందని కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. రెండేళ్లలో నాసిక్‌-సోలాపూర్‌ కారిడార్‌ నిర్మిస్తామని అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. 206 కిలోమీటర్ల మేర హైవేను విస్తరిస్తామని, దీంతో ఒడిశా లోని ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ది చేస్తామన్నారు. హైవే నిర్మాణం కోసం రూ.1526 కోట్లు కేటాయించారు. మౌలిక వసతు అభివృద్ది కోసం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తునట్టు తెలిపారు.

నాసిక్–సోలాపూర్ (అక్కల్‌కోట్) ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు.

పశ్చిమ – దక్షిణ భారతదేశాన్ని కలిపే సూరత్–చెన్నై హై-స్పీడ్ కారిడార్‌లో ఇది ఒక భాగమన్నారు. ప్రాజెక్ట్ పొడవు: 374 కి.మీ.. వ్యయం రూ.19,142 కోట్లుగా నిర్ణయించారు. దీని నిర్మాణంతో నాసిక్–సోలాపూర్ దూరం 14% తగ్గుతుందని (432 కి.మీ → 374 కి.మీ) తెలిపారు. సగటు వేగం 60 కి.మీ/గం నుండి 100 కి.మీ/గంకి పెరుగుతుందన్నారు. సూరత్-చెన్నై ప్రయాణ సమయం 45% తగ్గుతుందని.. 31 గంటల నుండి 17 గంటలకు తగ్గుతుందని వెల్లడించారు.

వొడాఫోన్‌-ఐడియా సంస్థకు భారీ ఉపశమనం..

వొడాఫోన్‌-ఐడియా సంస్థకు భారీ ఉపశమనం కలగిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రూ. 87.695 కోట్ల ఏజీఆర్‌ బకాయిలు ఫ్రీజ్‌ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్‌ చెల్లింపులపై ఐదేళ్ల పాటు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..