Good News: రైతులకు గుడ్ న్యూస్.. వరికి మద్దతు ధర ప్రకటించిన మోడీ సర్కర్

|

Jun 09, 2021 | 5:26 PM

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా వరి మద్దతు ధరను రూ.72 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Good News: రైతులకు గుడ్ న్యూస్.. వరికి మద్దతు ధర ప్రకటించిన మోడీ సర్కర్
Follow us on

రైతులకు మోదీ సర్కార్  తీపికబురు చెప్పింది.  కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా వరి మద్దతు ధరను రూ.72 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ ధర రూ.1940కు చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరపు ఖరీఫ్ పంటలకు ఇది వర్తిస్తుంది.

గత ఏడాది మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1868 వద్ద ఉండేది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే రేటునే కనీస మద్దతు ధర ( MSP) అని పిలుస్తారు. అంటే ప్రభుత్వం ఈ రేటుతో అన్నదాతల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది.

ఇక నువ్వుల మద్దతు ధర క్వింటాల్‌కు 452 రూపాయలను పెంచామని, మినుములు క్వింటాలుకు 300 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

 ఇవి కూడా చదవండి :   AP CM Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు.. అమిత్ షాతో ప్రత్యేక భేటీ..