Unemployed Youth letter to CM : వయసైపోతుంది.. సీఎంగారు ఉద్యోగం ఇస్తారా? .. పెళ్లి చేస్తారా? అంటూ ఓ నిరుద్యోగి లేఖ

|

Jan 12, 2021 | 6:42 PM

కొంత మంది యువకులు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి దొరికిన ఉద్యోగాన్ని చేసుకుంటే.. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగం కోసం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది సక్సెస్ అందుకుంటారు.. మరికొందరు.. నిరుద్యోగిగానే మిగిలిపోతారు.. అలా ఉద్యోగం కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్న ఓ యువకుడు..

Unemployed Youth letter to CM : వయసైపోతుంది.. సీఎంగారు ఉద్యోగం ఇస్తారా? .. పెళ్లి చేస్తారా? అంటూ ఓ నిరుద్యోగి లేఖ
Follow us on

Unemployed Youth letter to CM :మూలిగే నక్క మీద తాటిపడినట్లుగా .. అసలే అధిక జనాభా గల దేశం.. అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగావకాశాలతో యువత అల్లలాడుతుంటే.. ఇంతలో కరోనా వైరస్ అడుగు పెట్టింది. అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ తో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో నిరుద్యోగం మరింత ఎక్కువైంది. పరిస్థితి ఇప్పుడిప్పుడే మళ్ళీ పూర్వస్థితి వస్తున్నాయి. మళ్ళీ పరిశ్రమలను ఓపెన్ చేస్తున్నారు.

అయితే కొంత మంది యువకులు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి దొరికిన ఉద్యోగాన్ని చేసుకుంటే.. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగం కోసం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది సక్సెస్ అందుకుంటారు.. మరికొందరు.. నిరుద్యోగిగానే మిగిలిపోతారు.. అలా ఉద్యోగం కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్న ఓ యువకుడు ఏకంగా సీఎం కు ఓ వింత కోరిక కోరుతూ లెటర్ రాశాడు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రంలోని వసిం ప్రాంతానికి చెందిన గజానన్ రాథోడ్ అనే 35 ఏళ్ల యువకుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని లేదా పిల్లను చూసి పెళ్లి చేయాలని లెటర్ రాశాడు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని.. ఇప్పడు 35 ఏళ్ళు వచ్చాయి కానీ ఉద్యోగం మాత్రం రాలేదు.. మరోవైపు పెళ్లి చూపులకోసం వెళ్ళినప్పుడల్లా పెళ్లి కూతురు బంధువు గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అని అడుగుతున్నారు. ప్రభుత్వాలు కొన్నేళ్లుగా ప్రభుత్వ భర్తీలను నిర్వహించక పోవడంతో తనకు జాబ్ రాలేదని.. ఉద్యోగం లేదు కనుక పెళ్లి కాలేదు దీనికి కారణమైన సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పందించాలని గజనన్ కోరాడు. సోషల్ మీడియాలో ఈ లెటర్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

Also Read: తేనే , ఉసిరి కలిపిన మిశ్రమాన్ని రోజు తీసుకుంటే కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమిటో తెలుసా..?