Watch Video: విషాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ముగ్గురు మృతి..! షాకింగ్ వీడియో..

Bridge Collapsed: గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. పాలన్‌పూర్ ఆర్టీఓ సర్కిల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓవర్‌ బ్రిడ్జి కూలిపోయింది. ఓవర్‌బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోవడంతో ఆటో డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద సమాధి అయ్యారు. ఈ ఘటన గుజరాత్‌లో కలకలం రేపింది. ముగ్గురూ కూడా మరణించినట్లు పేర్కొంటున్నారు.

Watch Video: విషాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ముగ్గురు మృతి..! షాకింగ్ వీడియో..
Bridge Collapsed

Updated on: Oct 23, 2023 | 5:44 PM

Bridge Collapsed: గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. పాలన్‌పూర్ ఆర్టీఓ సర్కిల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓవర్‌ బ్రిడ్జి కూలిపోయింది. ఓవర్‌బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోవడంతో ఆటో డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద సమాధి అయ్యారు. ఈ ఘటన గుజరాత్‌లో కలకలం రేపింది. ముగ్గురూ కూడా మరణించినట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పాలన్‌పూర్‌ నగరంలోని ఆర్‌టీఓ సర్కిల్‌పై ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలడంతో ఆ ప్రాంతంలో రద్దీ నెలకొంది. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు, రోడ్డు నిర్మాణ విభాగం అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణ కోసం వివరాలు సేకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మీడియాకు తెలిపారు. లోపం వెలుగులోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నిర్మాణంలో ఉన్న భారీ వంతెన అందరు చూస్తుండగానే కుప్పకూలింది. భారీ శబ్దంతో వంతెన కుప్పకూలడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. ఓ ఆటో డ్రైవర్‌ ప్రాణభయంతో పరుగులు పెడుతున్న సమయంలో అతడిపై వంతెన కుప్పకూలింది. ఇలా ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

123 కోట్లతో త్రీ లెగ్ ఎలివేటెడ్ రోటరీ రైల్వే ఓవర్‌బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో 90 కోట్లతో వంతెనను నిర్మించడానికి పాలన్‌పూర్ ఏజెన్సీ ఆమోదించింది. ఇది 18 నెలల్లో పూర్తవుతుంది. పెరుగుతున్న వాహనాలు.. రద్దీకి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వంతెనలను నిర్మిస్తున్నాయి. అయితే, కొన్ని చోట్ల బ్రిడ్జిలు కుప్పకూలుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

వీడియో చూడండి..


నిర్మాణాలు కూలిపోవడం లాంటివి తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే, ఇలాంటి సంఘటనలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమా..? లేక ఏదైనా లోపం ఉందా..? ఇప్పుడే ఇలా జరిగితే.. భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాల పరిస్థితి ఏంటి ? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..