India – China talks: ఉక్రెయిన్(Ukraine) సంక్షోభం కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ గందరగోళాల మధ్య, తక్షణ కాల్పుల విరమణకు ప్రయత్నించాలని భారత్ – చైనా నిర్ణయించాయి. ఈమేరకు రెండు దేశాల మధ్య సంఘర్షణను తగ్గించడానికి దౌత్య సంబంధాలు మెరుగుపర్చేందుకు మార్గానికి తిరిగి తీసుకురావాల్సిన అవసరాన్ని భారతదేశం, చైనా శుక్రవారం అంగీకరించాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Minister Jai Shanker), చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి(Wang Yi) మధ్య మూడు గంటలపాటు జరిగిన సంభాషణలో ఈ అంశం తెరపైకి వచ్చింది. మీడియా సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ, “ఉక్రెయిన్‌లో తలెత్తిన పరిస్థితులు, యుద్ధం సంబంధిత పరిణామాల గురించి వాంగ్ యి చైనా దృక్కోణాన్ని తెలిపారు. భారతీయ దృక్కోణాన్ని కూడా స్పష్ఠం చేశాం.” అని అన్నారు.
ఇరుపక్షాలు తమ తమ విధానాలపై చర్చించుకున్నారని, దౌత్యం, సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వాలని అంగీకరించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ వివాదంపై భారతదేశం వైఖరి మొదటి నుండి ఇప్పటి వరకు దృఢంగా, స్థిరంగా ఉందన్నారు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందని విదేశాంగ మంత్రి గురువారం పార్లమెంటులో చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను భారతదేశం ఇంకా ఖండించలేదు. రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానంపై ఓటింగ్‌కు కూడా గైర్హాజరైన సంగతి తెలిసిందే.
ఇక, చైనా – రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత US సహా ఇతర పాశ్చాత్య దేశాలు ప్రకటించిన ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడంలో మాస్కోకు సహాయం చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తోంది. చైనీస్ విదేశాంగ మంత్రి ‘క్వాడ్’ అంశాన్ని లేవనెత్తారా అని జైశంకర్ ప్రశ్నించగా, “క్వాడ్‌పై ఎటువంటి చర్చ జరగలేదు” అని జైశంకర్ అన్నారు. క్వాడ్‌లో భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా సభ్య దేశాలు ఉన్నాయి. ఇటీవలే క్వాడ్ దేశాధినేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
మరోవైపు, ఇండో పసిఫిక్ సమస్య కూడా తలెత్తలేదని జైశంకర్ ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జైశంకర్ మాట్లాడుతూ, “మేము బహుపాక్షిక సమస్యలపై కూడా కొంతకాలం మాట్లాడాము. భద్రతా మండలితో సహా ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణను కొనసాగించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశామన్నారు.
Read Also… Memu Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శివారు ప్రాంతాలను కలుపుతూ మెము రైళ్లు