‘మహా’ సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం…

| Edited By: Ravi Kiran

Nov 29, 2019 | 5:28 PM

ఇరవై ఏళ్ళ తరువాత శివసేనకు చెందిన నేత (ఉద్దవ్ థాక్రే) మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాక థాక్రే కుటుంబంలో ఈ పదవిని మొదటిసారిగా చేపడుతున్న వ్యక్తి కూడా ఈయనే.. దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌‌లో ఉద్దవ్ థాక్రే 18వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గానీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ హాజరు […]

మహా సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం...
Follow us on

ఇరవై ఏళ్ళ తరువాత శివసేనకు చెందిన నేత (ఉద్దవ్ థాక్రే) మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాక థాక్రే కుటుంబంలో ఈ పదవిని మొదటిసారిగా చేపడుతున్న వ్యక్తి కూడా ఈయనే.. దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌‌లో ఉద్దవ్ థాక్రే 18వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గానీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ హాజరు కావడంలేదు. ఉధ్ధవ్ కుమారుడు, మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిత్య థాక్రే.. నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లి వీరిని వేర్వేరుగా కలిసి తన తండ్రి ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా కోరారు.

అయితే వారు నిరాకరించినట్టు తెలుస్తోంది.ఇక ఉధ్ధవ్ థాక్రేతో బాటు ప్రతిపార్టీ నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, ఛగన్ భుజ్ బల్, కాంగ్రెస్ పార్టీ నుంచి బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి దక్కుతుందని సమాచారం. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ మళ్ళీ పదవి పొందనున్నారు. కాగా-పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సహా సుమారు 400 మంది రైతులను కూడా ఉధ్ధవ్ ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. 43 మంత్రివర్గ శాఖల్లో శివసేన 16, ఎన్సీపీ 15, కాంగ్రెస్ పార్టీకి 12 పదవులు దక్కనున్నాయి.