ఇక ‘ మహా ‘ రైతుల రుణ మాఫీ.. సీఎంపీ హామీ

  మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పడిన ‘ మహా వికాస్ అఘాడీ ‘ గురువారం తన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపీ) ని విడుదల చేసింది. రైతులకు రుణమాఫీ చేస్తామని, 10 రూపాయలకే అందరికీ ఆహారం, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతులందరికీ తక్షణమే రుణ మాఫీ చేస్తాం.. ఎస్ ఆర్ ఏ పథకం కింద పేదలకు 500 చదరపు అడుగుల్లో ఇళ్ళు, అందరికీ ఆరోగ్య బీమా వంటి హామీలు […]

ఇక ' మహా ' రైతుల రుణ మాఫీ.. సీఎంపీ హామీ
Follow us

|

Updated on: Nov 28, 2019 | 7:47 PM

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పడిన ‘ మహా వికాస్ అఘాడీ ‘ గురువారం తన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపీ) ని విడుదల చేసింది. రైతులకు రుణమాఫీ చేస్తామని, 10 రూపాయలకే అందరికీ ఆహారం, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతులందరికీ తక్షణమే రుణ మాఫీ చేస్తాం.. ఎస్ ఆర్ ఏ పథకం కింద పేదలకు 500 చదరపు అడుగుల్లో ఇళ్ళు, అందరికీ ఆరోగ్య బీమా వంటి హామీలు కూడా ఇందులో ఉన్నాయి. పంటలు కోల్పోయిన రైతులకు వెంటనే సవరించిన పరిహారం లభించేలా చూస్తామని, నీటి కొరతను ఎదుర్కొంటున్న కరువు ప్రాంతాలకు ప్రత్యేక ‘ వాటర్ సిస్టం ‘ ఏర్పాటు చేస్తామని ఈ కూటమి పేర్కొంది. కాగా- హిందుత్వ, సావర్కార్, రామాలయ నిర్మాణం వంటి సమస్యలపై శివసేన ఇతర రెండు పార్టీలతో పూర్తిగా రాజీ పడిపోయింది. కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఈ అంశాల ప్రస్తావనే లేదు. రాజ్యాంగంలో పొందు పరచిన సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉంటామని మూడు పార్టీలూ హామీనిచ్చాయి. ఈ కనీస ఉమ్మడి కార్యక్రమ హామీల పత్రాన్ని శివసేననేత ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ విడుదల చేశారు. శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఈ ‘ మేనిఫెస్టో ‘ వంటి దానిని రిలీజ్ చేశారు.

రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..