Covid vaccine: వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణాలకు ముప్పు తప్పినట్లే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో కీలక విషయాలు

|

Jul 17, 2021 | 7:19 AM

ICMR Study - Covid-19 Deaths: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కోవిడ్ థర్డ్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే.. కోవిడ్

Covid vaccine: వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణాలకు ముప్పు తప్పినట్లే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో కీలక విషయాలు
Icmr Survey
Follow us on

ICMR Study – Covid-19 Deaths: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కోవిడ్ థర్డ్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా వ్యాప్తి తక్కువని.. దీంతోపాటు ప్రాణాలకు ముప్పు ఉండదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. కరోనా తీవ్రత మొదలవుతున్న వేళ దేశంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై ఐసీఎంఆర్‌ ఒక కీలక అధ్యయనాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అదే విధంగా టీకా తీసుకున్న వారి ప్రాణాలకు ముప్పు రాలేదని ఈ అధ్యయనంలో స్పష్టంచేసింది. అత్యధికులకి కరోనా వైరస్‌ సోకడానికి డెల్టా వేరియెంటే కారణమంటూ ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జరిగిన అతి పెద్ద అధ్యయనం ఇదేనంటూ ఐసీఎంఆర్ వెల్లడించింది.

కాగా.. కరోనా మరో ముప్పు మరింత ప్రభలకుండా ఉండాలంటే త్వరితగతిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలని అధ్యయనం పేర్కొంది. దీనివల్ల దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందంటూ ఐసీఎంఆర్ పేర్కొంది. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ ఒక్క డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా సోకిన 677 మంది శాంపిల్స్‌ని పరీక్షించినట్లు వెల్లడించింది. అందులో 86.09 మందికి డెల్టా వేరియెంట్‌ సోకిందని తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆల్ఫా వేరియెంట్‌ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని అధ్యయనంలో వెల్లడించింది. కరోనా సోకిన వారిలో 9.8% మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని.. మృతుల శాతం 0.4 గా నమోదైనట్లు పేర్కొంది. ఈ సమయంలో మరిన్ని వేరియంట్లు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని.. దీంతోపాటు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది.

Also Read:

Covid-19 Third Wave: కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది.. రానున్న రోజులు కఠినమైనవే: వీకే పాల్

COVID Precautions: “వ్యాన్‌ దగ్గరకు రండి..చేతులు శుభ్రం చేసుకోండి”.. పరిశుభ్రతతో కరోనాకు చెక్.. టీవీ9 వినూత్న కార్యక్రమం