కొనసాగుతున్న ఉగ్రవేట.. ఇద్దరు ముష్కరులు హతం..

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేస్తుంటే.. మన భారత సైన్యం మాత్రం ఓ వైపు కరోనాతో పోరాడుతూనే.. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేస్తోంది. మనదేశంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి.. ఏదో విధంగా దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్లాన్స్‌కు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది మన సైన్యం. తాజాగా.. జమ్ముకశ్మీర్‌లోని నవకదల్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు […]

కొనసాగుతున్న ఉగ్రవేట.. ఇద్దరు ముష్కరులు హతం..

Edited By:

Updated on: May 19, 2020 | 2:56 PM

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేస్తుంటే.. మన భారత సైన్యం మాత్రం ఓ వైపు కరోనాతో పోరాడుతూనే.. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేస్తోంది. మనదేశంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి.. ఏదో విధంగా దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్లాన్స్‌కు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది మన సైన్యం. తాజాగా.. జమ్ముకశ్మీర్‌లోని నవకదల్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సైన్యం.. వెంటనే ఎదురుకాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే వీరు ఏ ఉగ్రసంస్థకు చెందారన్న విషయం తెలియాల్సి ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మరికొందరు ఉగ్రవాదులు తప్పించుకోవడంతో.. సైన్యం కూంబింగ్ చేపడుతోంది. కాగా.. ఇటీవలే లోయలో టాప్ మోస్ట్ ఉగ్రవాదుల్ని సైన్యం ఏరిపారేస్తోంది. ఇటీవల రియాజ్ నైకూను కూడా హతమార్చడంతో పాటు.. పలువురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ కూడా చేసింది.