అస్సాంలో జనాభా అదుపునకు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం టు చైల్డ్ పాలసీని అమలు చేయడానికి శ్రీకారం చుడుతుందని ఆయన ప్రకటించారు. . రుణ మాఫీ వంటి సౌకర్యాలు ఇక టీ గార్డెన్స్ వర్కర్స్ కి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వర్తించబోవని, వారికి బదులు ఈ పాలసీని పాటించేవారికి అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ఒకరు లేదా మరో బిడ్డ ఉన్నవారికి మాత్రమే దక్కుతాయని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని అనుసరిస్తామని, అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. పాపులేషన్ పాలసీ అన్నది అప్పుడే అమలు కావడం ప్రారంభించింది అని ఆయన చెప్పారు. గత నెలలో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు స్వీకరించినప్పటినుంచే ఆయన జనాభా అదుపుపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ముస్లిములు ఇద్దరు బిడ్డల విధానాన్ని పాటిస్తే మేలని చెబుతూ వచ్చారు. మీరు డీసెంట్ ఫ్యామిలీ పద్దతిని అనుసరించాలని మూడు జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఉద్బోధించారు. ఈ జిల్లాల్లో ముస్లిముల జనాభా ఎక్కువగా ఉన్న దృష్ట్యా శర్మ. వీటిని విజిట్ చేశారు. జనాభా అదుపు వల్ల పేదరికం తగ్గుతుందని, పరిమిత కుటుంబం ఉన్నందువల్ల తమ సంతానాన్ని తల్లిదండ్రులు చక్కగా చదివించుకోగలుగుతారని…వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చగలరని ఆయన చెప్పారు.
ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉన్న కుటుంబాలను హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. ఇకనైనా మీరు పరిమిత కుటుంబాన్ని ఏర్పరచుకోవాలన్నారు. కాగా సీఎం ప్రకటనలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఈ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దేశంలో ఒక సీఎం జనాభా అదుపునకు సంబంధించి ఈ విధమైన పాలసీని చేపట్టడం ఇదే మొదటిసారని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sachin Tendulkar: ‘గ్రేటెస్ట్ మెన్స్ టెస్ట్ బ్యాట్స్ మెన్’ గా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎన్నిక !
ప్రధాని మోదీతో సమావేశానికి 8 పార్టీలకు ఆహ్వానం…….మెహబూబ్ ముప్తీ బదులు ఫరూక్ అబ్దుల్లా హాజరు