Watch Video: మెట్రోలో ఘర్షణ.. ఒకరినొకరు తన్నుకున్న యువకులు

|

Jun 29, 2023 | 4:14 AM

ఢిల్లీలోని మెట్రోలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. అప్పటికే ప్రయాణికలతో ఆ మెట్రో కిక్కిరిసిపోయింది. ఆ సమయంలోనే వారు ఒకరినొకరు కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో మెట్రో రైలు బయలుదేరబోతోంది. ఆ మెట్రో మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. కనీసం నిల్చోవడానికి కూడా సరైన చోటు దొరకని పరిస్థితి నెలకొంది

Watch Video: మెట్రోలో ఘర్షణ.. ఒకరినొకరు తన్నుకున్న యువకులు
Fight In Metro
Follow us on

ఢిల్లీలోని మెట్రోలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. అప్పటికే ప్రయాణికలతో ఆ మెట్రో కిక్కిరిసిపోయింది. ఆ సమయంలోనే వారు ఒకరినొకరు కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో మెట్రో రైలు బయలుదేరబోతోంది. ఆ మెట్రో మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. కనీసం నిల్చోవడానికి కూడా సరైన చోటు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఇద్దరు యువకుల మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత వారిద్దరు పిడిగుద్దులు కురిపించుకునే స్థాయికి పరిస్థితి చేజారిపోయింది. తోటి ప్రయాణికులు వారిని ఆపేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రైలులోని పరిస్థితి ఉద్రక్తంగా మారింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు స్పందించింది. గొడవకు పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మెట్రోలో ప్రయాణకులకు ఇబ్బందులు కలిగించేలా ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని సూచించింది. అయితే వీడియోపై సోషల్ మీడియాలో నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ యాజమాన్యం మాత్రం చేపట్టే చర్యలు శూన్యమని విమర్శించారు.

ఇవి కూడా చదవండి