యూపీ.. ఇంట్లో సామూహిక ప్రార్థనలు.. 12 మంది అరెస్ట్

యూపీలో కరోనా లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి ఇంట్లో ప్రార్థనలు చేసిన 12 మందికి పైగా బుక్ అయ్యారు. ముజఫర్ జిల్లాలోని సిసోలీ అనే గ్రామంలోజరిగిందీ ఘటన. నియమాలను ఉల్లంఘించి ఈ బృందమంతా ఇంటిలోనే సామూహిక ప్రార్థనలు చేసినట్టు పోలీసులు తెలిపారు. భారత శిక్షా స్మృతి చట్టంలోని సెక్షన్లతో బాటు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు వారు చెప్పారు. జిల్లాలో నలుగురికి మించి ఒక చోట చేరరాదన్న నిషేధాజ్ఞలు అమలు […]

యూపీ.. ఇంట్లో సామూహిక ప్రార్థనలు.. 12 మంది అరెస్ట్

Edited By:

Updated on: May 23, 2020 | 7:33 PM

యూపీలో కరోనా లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి ఇంట్లో ప్రార్థనలు చేసిన 12 మందికి పైగా బుక్ అయ్యారు. ముజఫర్ జిల్లాలోని సిసోలీ అనే గ్రామంలోజరిగిందీ ఘటన. నియమాలను ఉల్లంఘించి ఈ బృందమంతా ఇంటిలోనే సామూహిక ప్రార్థనలు చేసినట్టు పోలీసులు తెలిపారు. భారత శిక్షా స్మృతి చట్టంలోని సెక్షన్లతో బాటు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు వారు చెప్పారు. జిల్లాలో నలుగురికి మించి ఒక చోట చేరరాదన్న నిషేధాజ్ఞలు అమలు లో ఉన్నాయి. అయితే ఇంటిలో ప్రార్థనలు చేసుకున్నంత మాత్రాన కేసు పెడతారా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.