మాకు శాఖలేవీ ? ‘ మహా ‘ లో పోర్టుఫోలియోల లొల్లి ! 

|

Jan 02, 2020 | 3:11 PM

మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి మధ్య శాఖల కేటాయింపునకు సంబంధించి ‘ టగ్ ఆఫ్ వార్ ‘ మొదలయింది. శివసేన అధినేత, సీఎం ఉధ్ధవ్ థాక్రే తన మంత్రివర్గాన్ని విస్తరించి రెండు రోజులైంది. 36 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. తమ వారికి వ్యవసాయ, గ్రామీణాభివృధ్ది శాఖలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టు బడుతుండగా.. శివసేన పార్టీ వారికి ఇందులో ఓ శాఖ దక్కింది.  అయితే ఎన్సీపీ […]

మాకు శాఖలేవీ ?  మహా  లో పోర్టుఫోలియోల లొల్లి ! 
Follow us on
మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి మధ్య శాఖల కేటాయింపునకు సంబంధించి ‘ టగ్ ఆఫ్ వార్ ‘ మొదలయింది. శివసేన అధినేత, సీఎం ఉధ్ధవ్ థాక్రే తన మంత్రివర్గాన్ని విస్తరించి రెండు రోజులైంది. 36 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. తమ వారికి వ్యవసాయ, గ్రామీణాభివృధ్ది శాఖలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టు బడుతుండగా.. శివసేన పార్టీ వారికి ఇందులో ఓ శాఖ దక్కింది.  అయితే ఎన్సీపీ కూడా గ్రామీణాభివృద్ది శాఖను, సహకార శాఖను కోరడం విశేషం.
ఈ ‘ లొల్లి ‘ నేపథ్యంలో బుధవారం ఈ మూడు పార్టీల నాయకులూ సమావేశమై శాఖల కేటాయింపు మీద చర్చించారు. ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్ తొలుత సీఎం ఉద్దవ్ తో భేటీ అయ్యారు. శాఖల విషయంలో తమవారికి ‘ అన్యాయం ‘ జరిగిందని వారు ‘ వాపోయారు ‘. ఉధ్ధవ్ థాక్రే మాత్రం తమ పార్టీ సీనియర్ మంత్రి సుభాష్ దేశాయ్ కి వ్యవసాయ శాఖ ఇవ్వాలనే దృఢ నిశ్ఛయంతో ఉన్నారు. అదే సమయంలో శివసేన పార్టీకే చెందిన గులాబీ రావు పాటిల్, దాదా భూసే ఇద్దరూ కూడా ఇదే శాఖను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అంతా ‘ సర్దుకుంటుందని ‘, శాఖల కేటాయింపు సమస్య గురు లేదా శుక్రవారం పరిష్కారమవుతుందని డిప్యూటీ  సీఎం అజిత్ పవార్ స్పష్టం చేశారు.