పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఓ బ్రిడ్జి కింద పాత విమానమొకటి చిక్కుకుపోయింది. ఏనాటిదో.. ‘ ఇండియా పోస్ట్ ‘ విమానానికి ఈ దుర్గతి పట్టింది .విమానాశ్రయంలో పాడైపోయిన ఈ ప్లేన్ ని అతికష్టం మీద ఓ ట్రక్కుమీదికెక్కించి తీసుకువస్తున్న సందర్భమది.. అయితే జాతీయ రహదారిపై ఓ వంతెన కింద ఈ భారీ లోహవిహంగం చిక్కుకుపోవడంతో, ట్రక్కు డ్రైవర్ మరేమీ చేయలేక.. చేతులెత్తేశాడు. రోడ్డు మధ్యలో జరిగిన ఈ ఘటన కారణంగా.. ఎక్కడివక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇండియా పోస్ట్ కు చెందిన అధికారులు ఆ స్థలానికి చేరుకొని ‘ సమస్య ‘ పరిష్కారానికి నడుం బిగించారు. పోలీసులతో మంతనాలు ప్రారంభించారు. గతంలో ఈ బ్రిడ్జి కింద కొన్ని భారీ వాహనాలు ఇలాగే చిక్కుకుపోయినా.. ఆ తరువాత వాటిని మెల్లగా బయటికి తేగలిగారు.