మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఛతర్‌పూర్ సాగర్-కాన్పూర్ నేషనల్‌ హైవేపై ఈ సంఘటన జరిగింది. నాగర్ గారిమల్‌హారా సమీపంలో..

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Edited By:

Updated on: Aug 18, 2020 | 7:05 PM

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఛతర్‌పూర్ సాగర్-కాన్పూర్ నేషనల్‌ హైవేపై ఈ సంఘటన జరిగింది. నాగర్ గారిమల్‌హారా సమీపంలో కారు, ట్రక్కు ఢి కొట్టుకున్న ఘటనలో భార్యాభర్తలతో పాటుగా మరో వ్యక్తి మృతిచెందారు. మరో ఇద్దరు పిల్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాజ్‌పూర్‌ తహసీల్ ప్రాంతంలోని సింగ్పూర్ గ్రామంలో నివసిస్తున్న జంగ్‌బహదూర్ సింగ్ రాజ్‌పుత్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి.. రోహిత్ తివారీ అనే వ్యక్తితో కలిసి కారులో చిత్రకూట్ ధామ్ వెళ్లేందుకు బయల్దేరారు. అయితే సోమవారం సాయంత్రం వరకు చిత్రకూట్‌ను దర్శనం అనంతరం.. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మంగళవారం నాడు తెల్ల వారుజామున గారిమల్‌హారా దాటిన తర్వాత ఓ జంతువును రక్షిందచే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టారు. ఈ ఘటనలో జంగ్‌బహదూర్ సింగ్, అతడి భార్య విశాఖ, రోహిత్ తివారీ స్పాట్‌లోనే మరణించారు. వారి పిల్లలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లల్ని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు