సెమీస్పీడ్‌తో దేశ వ్యాప్తంగా తిరుగుతోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ రైళ్లలో అందించే ఫుడ్‌పై గత కొన్ని రోజులుగా చర్చసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ వందేభారత్ రైళ్లలోని ఫుడ్‌ను 5 స్టార్ హోటళ్లలోని టేస్ట్‌తో పోల్చాడు. అంతే నెటిజన్లంతా ఒక్కసారిగా తగులుకున్నారు.
సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో టికెట్ ధరలే కాదు.. లోపల అందించే ఫుడ్ ధర కూడా మోతమోగిపోతుంది. అయితే ధర అధికంగా ఉన్నా ఫుడ్ మాత్రం సరిగా ఉండటం లేదని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శశాంక్ గుప్తా వందే భారత్ రైల్లో ఉదయపూర్ నుంచి ఆగ్రాకు ప్రయాణించాడు. అయితే ప్రయాణ సమయంలో పోహా, కట్‌లెట్‌లు, ఆలూ సబ్జీతో పాటు పెరుగు, నమ్‌కీన్ ప్యాకెట్, చోకో-పై డెజర్ట్‌తో కూడిన ఫుడ్ ట్రేని కొనుగోలు చేశాడు.
Today I traveled in train no -20981 Udaipur Agra Vande Bharat express from Udaipur to Agra and the food in this train was no less than any five star hotel in terms of taste.
Thankyu @RailMinIndia @IRCTCofficial @AshwiniVaishnaw @AshwiniVaishnaw pic.twitter.com/gFOh5QJN4H— Shashank Gupta (@shashan0058641) September 2, 2024
అనంతరం సోషల్ మీడియాలో ఫుడ్ టేస్ట్ గురించి చెబుతూ ఓ పోస్టు పెట్టాడు. అందులో.. ‘ఈ రోజు నేను రైలు నెం -20981 ఉదయపూర్ – ఆగ్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాను. ఈ రైలులోని ఆహారం రుచి పరంగా ఏ ఫైవ్ స్టార్ హోటల్ కంటే తక్కువ కాదనే’ క్యాప్షన్‌తో తాను కొనుగోలు చేసిన ఫుడ్ ప్లేట్‌ను ఫొటో తీసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించారు.
Someone has to take you to a nice restaurant, urgently!
— Claudia (@claudiainbombay) September 3, 2024
వందే భారత్ రైల్లోని ఫుడ్‌ని ఫైవ్ స్టార్ హోటల్ టేస్ట్‌తో పోల్చడంపై విమర్శిస్తున్నారు. తన అభిప్రాయం సరైంది కాదని, ఈ సమీక్షను పోస్ట్ చేసేందుకు అతనికి డబ్బు చెల్లించి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.’ఇది 5-స్టార్ ఫుడ్ అయితే నేను షారుక్ ఖాన్’ అని ఒకరు, ‘అయితే నీ జీవితంలో ఒక్కసారి కూడా 5 స్టార్ హోటల్‌కి వెళ్లలేదన్నమాట’ అని మరొకరు, ‘ఇది ఏ రకంగ ఇది ఫైవ్ స్టార్ ఫుడ్ టేస్ట్ అనిపిస్తోంది’ అని ఇంకొకరు, ‘ఎవరైనా ముందు నిన్ను మంచి రెస్టారెంట్‌కు తీసుకెళ్లాలి..!’అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం శశాంక్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఇతగాడి రివ్యూపై ఐఆర్‌సీటీసీ కూడా స్పందిస్తూ.. ఫుడ్ రివ్యూపై సంతోషం వ్యక్తం చేసింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ధన్యవాదాలు తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.