సుప్రీం కోర్టు కొలీజియం కీలక నిర్ణయం..ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు

|

Dec 15, 2020 | 7:38 AM

తెలుగు రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌ను బ‌దిలీ చేయాల‌ని సుప్రీం కోర్టు కొలీ‌జియం నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. వీరితో పాటు దేశ వ్యాప్తంగా ప‌లు హైకోర్టుల న్యాయ‌మూర్తుల‌ను సైతం బ‌దిలీ కానున్న‌ట్లు...

సుప్రీం కోర్టు కొలీజియం కీలక నిర్ణయం..ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు
Follow us on

తెలుగు రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌ను బ‌దిలీ చేయాల‌ని సుప్రీం కోర్టు కొలీ‌జియం నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. వీరితో పాటు దేశ వ్యాప్తంగా ప‌లు హైకోర్టుల న్యాయ‌మూర్తుల‌ను సైతం బ‌దిలీ కానున్న‌ట్లు తెలుస్తోంది.దేశ వ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది మంది హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను కూడా బ‌దిలీ చేయాల‌ని కొలీజియం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

కాగా, సోమ‌వారం ఢిల్లీలో ఐదుగురు సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల‌తో కూడిన కొలీజియం సమావేశమైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం తీర్మానించినట్లు తెలిసింది. ఏపీ హైకోర్టులో సీజే తర్వాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ రాకేష్ కుమార్ ఈనెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నారు. ఇతర న్యాయమూర్తుల బదిలీలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా సీనియర్ జడ్జిలను నియమించనున్నట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తు తర్వాతి స్థానంలో ఉండి, అవసరాన్ని బట్టి తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వహించే స్థాయిలో ఉంటారని తెలుస్తోంది.

కాగా, త్వరలో సుప్రీం కోర్టు జడ్జిలు అయ్యే అర్హతలున్న జడ్జిలను త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను ఏ రాష్ట్రాలకు బదిలీ చేశారనే విషయం, వారి స్థానంలో కొత్తగా ఎవరిని నియమిస్తారనే విషయం మరో రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. కాగా, జస్టిస్ రాఘవేంద్రసింగ్ గత సంవత్సరం జూన్ 23న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాగా, ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి గత సంవత్సరం అక్టోబర్ 7న నియమితులయ్యారు.