Cable Bridge: వీళ్లకేం పోయే కాలమో..కేబుల్‌ బ్రిడ్జిపైకి కారును ఎక్కించిన టూరిస్టులు.. భగ్గుమంటున్న నెటిజన్లు

|

Nov 02, 2022 | 1:16 PM

కేబుల్‌ బ్రిజ్జికి సంబంధించి మరో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. నదిపై ఉన్న ఇరుకైన సస్పెన్షన్ బ్రిడ్జిపై కొంతమంది పర్యాటకులు కారును తీసుకెళ్తున్న వీడియో సంచలనంగా మారింది.

Cable Bridge: వీళ్లకేం పోయే కాలమో..కేబుల్‌ బ్రిడ్జిపైకి కారును ఎక్కించిన టూరిస్టులు.. భగ్గుమంటున్న నెటిజన్లు
Cable Bridge
Follow us on

మోర్బీ బ్రిడ్జి కూలిన విషాద సంఘటన జరిగి ఇంకా రెండు రోజులు కూడా కాలేదు. కేబుల్‌ బ్రిజ్జికి సంబంధించి మరో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. నదిపై ఉన్న ఇరుకైన సస్పెన్షన్ బ్రిడ్జిపై కొంతమంది పర్యాటకులు కారును తీసుకెళ్తున్న వీడియో సంచలనంగా మారింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగినట్టుగా తెలిసింది. శివపురా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని పిలువబడే ఈ నిర్మాణం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఎల్లపురా పట్టణంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు బ్రిడ్జిపైకి ఏకంగా కారును తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు.

బ్రిడ్జిపై కారును తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కారు వెనుక చాలా మంది టూరిస్టులు కనిపించారు. వాహనాన్ని తోసేటప్పుడు వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై నడవాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు టూరిస్టులు చేసిన పని ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి