Viral: పుష్ప సీన్ నిజమైన వేళ – నదిలోకి కొట్టుకొచ్చిన టన్నుల కొద్ది కలప

హిమాచల్ ప్రదేశ్ బీబీఎంబీ పండోహ్ డ్యామ్ వద్ద వర్షాల కారణంగా టన్నుల కలప చేరుకోవడం సంచలనం రేపింది. డ్యామ్ వద్ద కలప దృశ్యాలు 'పుష్ప' సినిమా దృశ్యాలను గుర్తు చేస్తుండగా, నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Viral: పుష్ప సీన్ నిజమైన  వేళ - నదిలోకి కొట్టుకొచ్చిన టన్నుల కొద్ది కలప
Wood Floating

Updated on: Jun 28, 2025 | 1:06 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కుల్లు జిల్లాలోని బీబీఎంబీ పండోహ్ డ్యామ్ వద్ద బుధవారం సాయంత్రం టన్నుల కొద్దీ కలప కొట్టుకొచ్చింది. నదిలో వర్షాల కారణంగా కొట్టుకొచ్చిన ఈ కలపతో డ్యామ్ వద్ద ఈ సీన్స్ కనిపించాయి. డ్యామ్ వద్ద కలప తేలియాడుతున్న దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు పుష్పరాజ్ ఎక్కడా? అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ అధికారుల వైఫల్యాన్ని విమర్శిస్తూ..’ఇక్కడ చట్ట పాలన కాదు, పుష్ప పాలన జరుగుతోంది’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.