‘నేనూ దళిత్ నే ! బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ‘గర్జన ‘ !

తాను కూడా దళిత్ నే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గర్జించారు. దళితులు, మైనారిటీలను, రైతులను కేంద్రం, యూపీలోని బీజేపీ ప్రభుత్వం టార్చర్ పెడుతున్నాయని..

నేనూ దళిత్ నే ! బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గర్జన  !

Edited By:

Updated on: Oct 03, 2020 | 8:10 PM

తాను కూడా దళిత్ నే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గర్జించారు. దళితులు, మైనారిటీలను, రైతులను కేంద్రం, యూపీలోని బీజేపీ ప్రభుత్వం టార్చర్ పెడుతున్నాయని ఆమె మండిపడ్డారు. హత్రాస్ ఘటనకు నిరసనగా శనివారం కోల్ కతా లో తమ తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ఆమె.. హత్రాస్ ఘటనపట్ల యూపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. కోవిడ్ భయంకర పాండమిక్ అని, కానీ బీజేపీ అంతకన్నా పెద్ద పాండమిక్ అని ఆమె నిప్పులు చెరిగారు. రేపు తాను హత్రాస్ వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తానని దీదీ తెలిపారు. ఈ ర్యాలీలో అడుడుగునా ఆమె బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ వచ్చారు.  వచ్ఛే ఏడాది తమ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఈ పార్టీని ఘోరంగా ఓడిస్తామన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us