తమిళనాడులో షాపింగ్ మాల్స్, దుకాణాలు, రెస్టారెంట్లు ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి పది గంటల వరకు తెరచి ఉంటాయి.. రాత్రి పది గంటల వరకు వ్యాపారం చేసుకోవచ్చంటూ అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 23న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల వారీగా లాక్‌డౌన్‌ను సడలించింది.. ఆన్‌లాక్‌లో భాగంగా చాలా ఆంక్షలను సడలించింది.. ఇటీవల అన్‌లాక్-5 మార్గదర్శకాలలో అన్ని రకాల వ్యాపార సముదాయాలను రాత్ర పది గంటల వరకు తెరుచుకోవచ్చని తెలిపింది.. అయితే ఈ సడలింపుల నిర్ణయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది.. అయితే తమిళనాడులో కరోనా వైరస్ కొంచెం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం షాపింగ్ మాల్స్‌కు రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచుకునే అవకాశం ఇవ్వలేదు.. ఇప్పుడు కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలను రాత్రి పది గంటల వరకు నిర్వహించుకోవచ్చని తెలిపింది.