Yusuf Pathan: ఆ ఫొటోలు ఉపయోగించడం నేరం.. యూసఫ్ పఠాన్‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు..

|

Mar 28, 2024 | 12:27 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఇప్పటికే.. హోరాహోరీ ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. కాగా.. పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో యూసఫ్ పఠాన్ పై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Yusuf Pathan: ఆ ఫొటోలు ఉపయోగించడం నేరం.. యూసఫ్ పఠాన్‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు..
Yusuf Pathan
Follow us on

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఇప్పటికే.. హోరాహోరీ ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. కాగా.. పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో యూసఫ్ పఠాన్ పై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మాజీ క్రికెటర్-రాజకీయవేత్త 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశం గెలిచిన క్షణాల పోస్టర్‌లను ప్రచారం కోసం ఉపయోగించడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘిస్తున్నారని, యూసుఫ్ పఠాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది.

“వెస్ట్ బెంగాల్‌లోని బహరంపూర్ నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికలలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి యూసుఫ్ పఠాన్, ఈ నియోజకవర్గంలోని వివిధ ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు, ఫోటోలను ఉపయోగిస్తున్నారు. ఇది ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్, 2011 విజేత క్షణాలను స్పష్టంగా వర్ణిస్తుంది.. ఇక్కడ భారతరత్న సచిన్ టెండూల్కర్, ఇతరులతో సహా మన దేశంలోని ఉన్నత స్థాయి క్రికెట్ సెలబ్రిటీల ఫోటోలు ఉన్నాయి.. ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2011 విజేత క్షణాలు జాతీయ గర్వంతో పాటు ప్రతి భారతీయుడు గౌరవించే సెంటిమెంట్” అని కాంగ్రెస్ పేర్కొంది.

2011 ప్రపంచ కప్ విజయాన్ని “చిన్న వస్తు ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రచార సమయంలో ఉపయోగించుకోకూడదు. అంతేకాకుండా, ఇది దేశంలో ఇప్పటికే విధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించడమేనని మేము భావిస్తున్నాము… ఎన్నికల ప్రచారంలో మన జాతీయ నాయకుల ఫోటోలను అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించడాన్ని” ఆపాలని ఎన్నికల ప్యానెల్‌ను కోరుతున్నాం అంటూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది.

అయితే, మాజీ క్రికెటర్, TMC అభ్యర్థి యూసఫ్ పఠాన్ ప్రపంచ కప్ ఫోటోలను ఉపయోగించడాన్ని సమర్థించారు. ‘నేను ప్రపంచకప్‌ గెలిచాను. ఈ ఘనత సాధించిన వారు చాలా తక్కువ. ఇది (ప్రపంచ కప్ ఫోటోల ఉపయోగం) తప్పు అయితే, ఎన్నికల సంఘం చూస్తుంది.. న్యాయ బృందం ఈ విషయాన్ని పరిశీలిస్తుంది, ”అని యూసుఫ్ పఠాన్ ను ఉటంకిస్తూ ఓ జాతీయ ఛానెల్ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..