పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ని భారీగా పునర్వ్యవస్థీకరించారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ నియోజకవర్గ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. శనివారం జరిగిన టీఎంసీ వర్కింగ్ కమిటీ తొలి సమావేశంలో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే నిబంధనను కూడా ఆమోదించినట్టు మంత్రి పార్థ ఛటర్జీ తెలిపారు. ఈ రాష్ట్రాన్ని మించి తన సంస్థాగత వ్యవస్ధను బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. కొత్త నిబంధన కారణంగా అభిషేక్ బెనర్జీ..ఇక టీఎంసి యూత్ వింగ్ ఇన్-ఛార్జ్ పదవిని వదులుకోవలసి ఉంటుంది. ఈ పదవిలో పొలిటికల్ లీడర్ గా మారిన నటుడు సాయోనీ ఘోష్ ని నియమించనున్నారు. పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదర్ ను,నియమించగా…. ఇండియన్ నేషనల్ తృణమూల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మరో ఎంపీ దోలా సేన్ నియమితులు కానున్నారు. పార్టీ రైతు విభాగం అధ్యక్షునిగా పూర్నేందు బోస్ వ్యవహరిస్తారని పార్థ ఛటర్జీ తెలిపారు. టీఎంసి సాంస్కృతిక విభాగం ఇన్-చార్జిగా మాజీ సినీ దర్శకుడు, మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన రాజ్ చక్రవర్తిని నియమించామన్నారు.
ఇలా ఉండగా బీజేపీ పట్ల తమ భ్రమలు తొలగిపోయాయని, తాము మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరుతామని పలువురు నేతలు చేస్తున్న అభ్యర్థనలను పార్టీ చురుకుగా పరిశీలిస్తోంది. వీరంతా అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసీని వీడి బీజేపీలోకి జంప్ అయ్యారు. తమకు బీజేపీలో తగిన గుర్తింపు లేదని వీరు వాపోతున్నారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకోబోయే నిర్ణయం కోసం వీరు ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా తో కన్ను మూసినా మగసింహం..!పోస్టుమార్టం లో తెలిసిన షాకింగ్ నిజాలు.ఇంకా 13 సింహాలకు పాజిటివ్ గా రిపోర్ట్ : Lion Video.
Balakrishna : ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య.. ( వీడియో )