కరోనాపై సార్క్ ఉమ్మడి పోరాటం..ప్రధాని మోదీ పిలుపు

| Edited By: Ravi Kiran

Mar 15, 2020 | 2:11 PM

కరోనాపై సార్క్ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మనమంతా సమిష్టిగా చేతులు కలిపితే ఈ మహమ్మారిని జయించవచ్చు అన్నారు.

కరోనాపై సార్క్ ఉమ్మడి పోరాటం..ప్రధాని మోదీ పిలుపు
Follow us on

కరోనాపై సార్క్ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మనమంతా సమిష్టిగా చేతులు కలిపితే ఈ మహమ్మారిని జయించవచ్చు అన్నారు. ఆరోగ్యవంతమైన ఈ భూగ్రహం కోసం సకాలంలో చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్క్ దేశాధినేతలంతా దీనిపై చర్చిస్తారని, ఒక రోడ్ మ్యాప్ ని రూపొందిస్తారని ఆయన ట్వీట్ చేశారు. మన ఐక్యతసత్పలితాలను ఇస్తుంది.. మన ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది అని మోదీ ట్వీట్ చేశారు. సార్క్ లో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి.

పౌరులను ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు అనువైన మార్గాల కోసం ఈ నేతలంతా పటిష్టమైన వ్యూహాన్ని ప్లాన్ చేస్తారని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతారని ఆయన తెలిపారు. కోవిడ్-19 పై పోరాటానికి ఇక మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ ఉపఖండం ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అటు.. ఈ ఫైట్ కి ఇండియా నేతృత్వం వహిస్తుందని, మోదీ ఆధ్వర్యాన సార్క్ దేశాధినేతలంతా ముందుకు వస్తారని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా-ఇండియాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 90 కి పెరిగింది.