బాబోయ్ పులి.. యువకుడి పై దాడి చేసి.. ఇంకెవరైనా చిక్కుతారేమోనని ఆశగా ఎదురు చూసి

|

Mar 06, 2022 | 5:17 PM

అడవుల్లో ఉండాల్సిన జంతువులు(Animals) జనావాసాల్లోకి(Public Places) వస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవుల సమీప గ్రామాలు..

బాబోయ్ పులి.. యువకుడి పై దాడి చేసి.. ఇంకెవరైనా చిక్కుతారేమోనని ఆశగా ఎదురు చూసి
Follow us on

అడవుల్లో ఉండాల్సిన జంతువులు(Animals) జనావాసాల్లోకి(Public Places) వస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవుల సమీప గ్రామాలు, పట్టణాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించి అలజడి సృష్టిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అడవి చుట్టుపక్కల నివసించే రైతులు, గ్రామీణ ప్రజలకు ఇది కొత్త సమస్య కాదు. ప్రాణాలు తీసే క్రూర మృగం. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఊరిపై పడింది. అదను చూసి ఓ యువకుడిపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కొత్వాలి జిల్లాలో జరిగింది. ఎటాహ్‌ (Etah)సమీపంలోని నాగ్లాసమాల్‌ గ్రామంలో పులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం సైఫాయి ఆస్పత్రికి తరలించారు. ఊరిపై పడిన పులి హల్‌చల్ చేయడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫారెస్ట్‌ అధికారులు, గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు.

అయితే యువకుడిపై దాడి చేసి ఆకలి తీర్చుకున్న పులి.. తన పంజాకు మరెవరైనా చిక్కుతారామోనని గంటల తరబడి గ్రామంలోని ఓ రేకుల షెడ్‌పై పడిగాపులు కాసింది. మరోవైపు గ్రామస్థులు కూడా దాని పంజాకు చిక్కకుండా దాన్ని భయపెట్టి పారిపోయే విధంగా చేశారు. దీంతో పులి పక్కనున్న అటవీ ప్రాంతంలోకి పారిపోయింది.

Also Read

Cow Dung Scheme: ఆవుపాలే కాదు పేడతో కూడా ఆదాయమే.. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..!

Viral Video: చేతిపై 18 గుడ్లను బ్యాలెన్స్ చేసిన యువకుడు.. శెభాష్ అంటున్న నెటిజన్లు

Mohan babu controversy: రంగంలోకి మోహన్ బాబు అభిమానులు.. నాగబాబుకు వార్నింగ్