3 Trains on One Track: ఒకే ట్రాక్‌పై వచ్చిన మూడు రైళ్లు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

|

Nov 23, 2023 | 10:53 AM

మూడు ప్యాసింజర్‌ ట్రైన్లు ఒకే ట్రాక్‌పై వచ్చిన ఘటన రూర్కెలాలో చోటుచేసుకుంది. సుందర్‌గఢ్‌ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారిక సమాచారం మేరకు సంబల్పూర్-రూర్కెలా మెము రైలు, రూర్కెలా-జార్సుగూడ ప్యాసింజర్ రైలు ఒక ట్రాక్‌లో ఎదురు రెదురుగా వచ్చాయి. 100 మీటర్ల దూరంలో ఒకే లైన్లో ఎదురెదురుగా వచ్చిన ఈ రెండు రైళ్లలోని లోకోపైలట్లు..

3 Trains on One Track: ఒకే ట్రాక్‌పై వచ్చిన మూడు రైళ్లు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
Three Trains On One Track In Rourkela
Follow us on

కటక్, నవంబర్‌ 23: మూడు ప్యాసింజర్‌ ట్రైన్లు ఒకే ట్రాక్‌పై వచ్చిన ఘటన రూర్కెలాలో చోటుచేసుకుంది. సుందర్‌గఢ్‌ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారిక సమాచారం మేరకు సంబల్పూర్-రూర్కెలా మెము రైలు, రూర్కెలా-జార్సుగూడ ప్యాసింజర్ రైలు ఒక ట్రాక్‌లో ఎదురు రెదురుగా వచ్చాయి. 100 మీటర్ల దూరంలో ఒకే లైన్లో ఎదురెదురుగా వచ్చిన ఈ రెండు రైళ్లలోని లోకోపైలట్లు వెంటనే అప్రమత్తమై రైళ్లను ఆపు చేశారు.

ఆ తర్వాత మూడవ రైలు పూరీ-రూర్కెలా వందే భారత్ కూడా అదే ట్రాక్‌పైకి వచ్చింది. రూర్కెలా రైల్వే స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివిధ రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగా ఇలా జరిగినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా రైల్వే అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.

అధికారి దురుసు ప్రవర్తన.. ఉద్యోగులపైకి దూసుకెళ్లిన అధికారి కారు

నిరసన తెలుపుతోన్న సిబ్బందికపైకి ఓ అధికారి నిర్లక్ష్యంగా నడిపిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి గాయం అయ్యింది. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలుపుతుండగా కారుతో ప్రమాదకరంగా ప్రయాణించిన అధికారి దురుసు ప్రవర్తనను ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. అసలేం జరిగిందంటే..
జీతం బకాయిల్ని తక్షణం చెల్లించాలని సమగ్ర శిక్ష అభియాన్‌ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు అనకాపల్లి జిల్లా కశింకోటలో ఆందోళన చేపట్టారు. అయితే వారు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది శిక్షణ తరగతుల్ని బహిష్కరించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం తరగతి గదుల నుంచి బయటికి వచ్చి మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. శిక్షణ తరగతులకు వస్తున్న జిల్లా విద్యాశాఖ ఏడీ రవిబాబుకు తమ సమస్యల్ని విన్నవించాలని ఆయన కారును వారంతా అడ్డుకున్నారు. అయితే కారును ఆపకుండా పోనివ్వాలని ఏడీ సూచించడంతో డ్రైవర్‌ ముందుకు పోనిచ్చాడు. దీంతో నిరసనకారుల్లో నక్కపల్లికి చెందిన ఎమ్మార్సీ డి ఝాన్సీ అనే ఉద్యోగి ఎడమ కాలు మీదుగా కారు వెళ్లడంతో ఆమెకు గాయాలయ్యాయి. అయినప్పటికీ ఏడీ తన కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. గాయపడిన ఝాన్సీని తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.