Delhi Criminal Gang Encounter: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెట్రేగిపోతున్న నేరాలను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్యాంగ్‌లుగా ఏర్పడి జనాన్ని పట్టిపీడుతున్న ముగ్గురు క్రిమినల్స్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్‌కౌంటర్ చేసింది. గురువారం..ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్ కౌంటర్ ముగ్గురు షార్ప్ షూటర్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. నేరస్థులు.. నీరజ్ బవానా, తిల్లు తాజ్‌పురి, పర్వేష్ మాన్‌గా పేర్కొన్నారు. వీరంతా క్రిమినల్ గ్యాంగ్‌లో క్రియాశీల సభ్యులని తెలిపారు. కాగా.. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో ఒక పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. బుల్లెట్ తగిలిందని ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని తెలిపింది.
క్రిమినల్ గ్యాంగ్ సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అనంతరం వారిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Three sharpshooters after an encounter by Delhi Police Special Cell. All three are active members of the criminal gang of Neeraj Bawana, Tillu Tajpuri and Parvesh Mann. During the encounter, one police personnel received bullet injuries: Delhi Police Special Cell
— ANI (@ANI) May 19, 2022